Motorola Prime: ప్రస్తుతం ప్రతి పని మొబైల్ తోనే కొనసాగుతోంది. మనీ ట్రాన్స్ఫర్ నుంచి పెద్దపెద్ద ఫైల్స్ కూడా మొబైల్ ద్వారానే పంపించుకునే సౌకర్యం ఉండడంతో చాలామంది అప్డేట్ అవుతున్న స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వీరికి అనుగుణంగా కంపెనీలు సైతం అప్డేట్ అవుతూ.. ఆకర్షణీయమైన ఫీచర్లను జోడించి వినియోగదారుల అవసరాలను తీర్చడానికి బ్యాటరీ, కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసి కొత్త మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా Motorola కంపెనీకి చెందిన ఓ మొబైల్ ఆకర్షిస్తుంది. ఇందులో రోజువారి అవసరాలకు ఉపయోగపడే ఫీచర్లతో పాటు ధర కూడా తక్కువగా ఉండడంతో ఈ కంపెనీకి చెందిన ఓ మొబైల్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఆ మొబైల్ ఎలా ఉందంటే?
Motorola కంపెనీకి చెందిన కొత్త Prime స్మార్ట్ఫోన్ మార్కెట్లో అలరిస్తోంది. ఇందులో ప్రధానంగా కెమెరా, బ్యాటరీ వ్యవస్థతోపాటు ఫాస్టెస్ట్ చార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఇది అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తోంది. ప్రధానంగా ఇందులో కెమెరా గురించి చర్చిస్తే.. ఈ ఫోన్లో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది ఆల్ట్రా వైడ్ తో కలిగి ఉంటుంది. 12MP టెలి ఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కోసం కూడా అద్భుతమైన మెగాపిక్సలను అమర్చారు. నేటి తరం కోరుకునే ఏఐ ఫోటోలు కావాలంటే కూడా దీనిద్వారా HDR మూడులో మార్చుకోవచ్చు. వీడియోలు కూడా హెచ్డి క్వాలిటీతో రికార్డు చేయవచ్చు.
అలాగే ఈ మొబైల్ లో బలమైన బ్యాటరీ వ్యవస్థను అమర్చారు. ఇందులో 4,500 mah బ్యాటరీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బ్యాటరీ కి అనుగుణంగా పాస్ టెస్ట్ చార్జర్ టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. 125 వాట్ చార్జింగ్తో మద్దతు ఇస్తుంది. 50 W వైర్లెస్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. టెన్ వాట్స్ రివర్స్ చార్జింగ్ కూడా ఇవ్వనుంది. దీంతో రోజంతా ఉపయోగించే వారికి ఈ చార్జర్ అనుగుణంగా పనిచేస్తుంది. అంతేకాకుండా నిమిషాల్లోనే 100% చార్జింగ్ అయ్యేలా సెట్అప్ చేశారు.
ఈ మొబైల్లో ఫీచర్స్ కూడా యూత్ కు అనుగుణంగా ఉన్నాయి. ఇందులో ఉండే ప్రాసెసర్ 8GB లేదా 12GB రామ్ ఉండే అవకాశం ఉంది. 256 జీబీ స్టోరేజ్ వరకు ఉండడంతో కావాల్సిన ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా UI దీన్ని మరింత వేగవంతంగా చేసుకునే అవకాశం ఉంది. మరో విశేషం ఏంటంటే 8 జెన్ 1 ప్రాసెసర్ తో పనిచేయడంతో 5జి కనెక్టెడ్ వేగవంతంగా ఉంటుంది. ఇలాంటి నెట్వర్క్ ఆయన ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా ఇందులో సాఫ్ట్వేర్ను అమర్చారు. ఇది మార్కెట్లోకి వస్తే అనుకూలమైన ధర ఉండే అవకాశం ఉందని అంటున్నారు.