Motorola G85: నేటి కాలంలో మొబైల్ లేకుండా ఏ పని ముందుకు సాగడం లేదు. అయితే కొందరు ఖరీదైన మొబైల్స్ కొనుగోలు చేస్తే.. మరికొందరు బడ్జెట్లో మొబైల్ కొనాలని చూస్తారు. అయితే Motorola కంపెనీకి చెందిన మొబైల్స్ బడ్జెట్లో ఉంటాయని చాలామంది భావన. అందుకే ఈ కంపెనీ నుంచి ఏ మొబైల్ మార్కెట్లోకి వచ్చిన దాని గురించి తెలుసుకుంటారు. కంపెనీ సైతం వినియోగదారులకు అనుగుణంగా తక్కువ ధరలోనే మొబైల్స్ ను ప్రవేశపెడుతుంది. ఇందులో భాగంగా లేటెస్ట్ గా G85 5G మొబైల్లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది కెమెరా తో పాటు బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉండడంతో దీనిని కొనాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఇందులో ఉండే ఫీచర్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం..
మోటరోలా కంపెనీకి చెందిన జి 85 మొబైల్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఏ మొబైల్ లో లేని విధంగా ఇందులో 260 MP కెమెరాను అమర్చారు. దీని ద్వారా AI ఫోటోలను తీసుకునే అవకాశం ఉంటుంది.అలాగే 32MP సెల్ఫీ కెమెరా ఉండడంతో ఫోటోగ్రఫీ కోరుకునే వారికి ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఫోటోలు, వీడియోల కోసం దీనిని అనుకూలంగా వాడుకోవచ్చు. ఈ మొబైల్ డిస్ప్లే గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. స్మూత్ స్క్రోలింగ్.. సినిమాలు, గేమింగ్ కోరుకునేవారు ఈ డిస్ప్లేతో అద్భుతమైన అనుభవాన్ని పొందవచ్చు. ఇందులో 6 GB నుంచి 8 GB వరకు ర్యామ్ పనిచేస్తుంది. దీంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువగా యాప్స్ యూస్ చేసినా స్లో కాకుండా ఉంటుంది.
ఈ మొబైల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ గురించి. ఇందులో 8,200 mAh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ తో రోజంతా మొబైల్ వినియోగించినా కూడా చార్జింగ్ తగ్గకుండా ఉంటుంది. అలాగే డౌన్ టైం కూడా తక్కువగా ఉంటుంది. ఈ బ్యాటరీ ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుండడంతో బిజీగా ఉండే ఉద్యోగులు, వ్యాపారస్తులకు తొందరగా చార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. నిమిషాల్లోనే 70 నుంచి 100% చార్జింగ్ కావడానికి సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం అంతా 5జి నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. నెట్వర్క్ కనెక్టివిటీలో G85 అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ మొబైల్ ధర రూ.11,999 తో విక్రయిస్తున్నారు. మొత్తంగా కెమెరా, బ్యాటరీ కావాలని కోరుకునే వినియోగదారులకు మీ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.