DELL XPS: భారతీయ ల్యాప్ టాప్ మార్కెట్లో డెల్ (DELL) కంపెనీకి తిరుగులేని స్థాయి ఉంది. ధరల విషయంలో ఈ కంపెనీ కాంప్రమైజ్ కాదు. కాకపోతే తయారుచేసే ఉత్పత్తిలో మాత్రం అద్భుతమైన క్వాలిటీ మైంటైన్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ ఎన్నో రకాల ల్యాప్ టాప్ లు తయారు చేసింది. అందులో ఎక్స్ పీ ఎస్ సుప్రసిద్ధమైనది. అయితే గత ఏడాది దీని తయారీని డెల్ నిలుపుదల చేసింది. అది ఎంత తప్పో ఈ కంపెనీకి తెలిసి వచ్చింది.
2026 లో ఎక్స్ పీ ఎస్ మోడల్ ను పూర్తిగా ఆధునికరించి.. మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని డెల్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వార్షిక టెక్ షో కంటే ముందు సమయంలో ఆధునీకరించిన డెల్ ఎక్స్ పీ ఎస్ మోడల్ ను ప్రదర్శించిందని video cardtz వర్గాలు చెబుతున్నాయి. సీఈఎస్ 2025 లో ఎక్స్పీఎస్ పేరును రీటైర్ చేసి.. దానిని డెల్, డెల్ ప్రో, డెల్ ప్రో మ్యాక్స్ టైర్ లు కలిగివున్న స్ట్రీమ్ స్ట్రీమ్ లైన్ స్ట్రక్చర్ తో భర్తీ చేసిందని వార్తలు వస్తున్నాయి. ప్రీమియం బ్యాడ్జ్ ఎక్స్ప్రెస్ ఎక్స్ పీ ఎస్ వారసత్వాన్ని ఈ కంపెనీ కొనసాగించాలని.. అలా అయితేనే డెల్ కంపెనీ బ్రాండ్ కు గుర్తింపు ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఎందుకు మళ్ళీ వచ్చింది
2025 మధ్యలో డెల్ 14 ప్రీమియం, 16 ప్రీమియం వంటి మోడల్స్ ప్రారంభించింది. అయితే ఇవి ఆశించిన స్థాయిలో అమ్ముడుపోలేదు. అంతేకాదు మార్కెట్లో చాలామంది వినియోగదారులు ఎక్స్ పీ ఎస్ మోడల్ కావాలని అడగడం.. డిస్ట్రిబ్యూటర్లు కూడా పదే పదే ఈ మోడల్స్ కు డిమాండ్ ఉందని చెప్పడంతో డెల్ కంపెనీ పునరాలోచనలో పడింది. దీంతో ఈ ఏడాది ఆధునీకీకరించిన ఎక్స్ పీ ఎస్ మోడల్ ను డెల్ కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఇంటెల్ తాజా కోర్ అల్ట్రా 300 ఫాంథర్ లేక్ ప్రాసెసర్ ఉపయోగించింది. AMD, qualcomm వంటి వేరియంట్లను కూడా ఇందులో ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇందులో ప్రవేశపెట్టినట్టు సమాచారం. అయితే ఈ మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చే విషయంపై ఇంతవరకు డెల్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. ముందస్తు బ్రీఫింగ్ ప్రజెంటేషన్ దానిని సూచిస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
“నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి కొత్త కొత్త సదుపాయాలు అవసరం అవుతున్నాయి. సృజనాత్మకతను రూపొందించే వారికి ల్యాప్ టాప్ లు ఒక అవసరం మాదిరిగా మారిపోయాయి. అందువల్లే డెల్ కంపెనీ తన ఉత్పత్తుల్లో ఆధునికతను జోడిస్తోంది. ఇందులో కొంతవరకు సమాచారాన్ని మాత్రమే బయటికి లీక్ చేసింది. పోటీ కంపెనీల ఒత్తిడిని తట్టుకుంటూ సరికొత్త మోడల్ రూపొందించింది. అయితే దీనికి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలను బయటికి పొక్కకుండా కంపెనీ జాగ్రత్తలు వహిస్తోందని” టెక్ నిపుణులు చెబుతున్నారు.