Homeబిజినెస్Honda ZR V Hybrid SUV: ఈ Honda కారు త్వరలో మార్కెట్లోకి.. ధర రూ.50...

Honda ZR V Hybrid SUV: ఈ Honda కారు త్వరలో మార్కెట్లోకి.. ధర రూ.50 లక్షలు..? ఇంతకీ ఇందులో ఏం స్పెషల్ అంటే?

Honda ZR V Hybrid SUV: ప్రముఖ కార్ల కంపెనీ Honda కొత్త హైబ్రిడ్ SUV కారును భారతదేశంలోని తీసుకురాబోతుంది.. ఇందులో భాగంగా ఈ కారును ఇటీవల ఆవిష్కరించింది. ఇప్పటికే జపనీస్ మార్కెట్లో దీనిని తీసుకువస్తున్నారు. త్వరలోనే భారత్లో కూడా ఇది కనిపించనుంది. ఈ కారు 2026 సంవత్సరంలో మూడు వేరియెంట్లలో రానుంది. ఇందులో ఉండే స్పెసిఫికేషన్స్.. ఇంజన్ స్థాయి చూసి చాలామంది ఇప్పటికే ఇంప్రెస్ అవుతున్నారు. అంతేకాకుండా సీట్లు కొత్త రంగులో కనిపించడంతో ఆకర్షితులవుతున్నారు. ఇంతకీ ఈ కారు ఎలా ఉండబోతుందంటే?

Honda కంపెనీ నుంచి ZR V hybrid SUV త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ఈ కారుకు 18 అంగుళాల అల్లాయి వీల్స్ ఉండబోతున్నాయి. ఇప్పటివరకు ఎవరు ఊహించని రంగుల్లో ఇది ఉండబోతుంది. వీటిలో ఒకటి ట్విటైట్ లిస్ట్ బ్లాక్ పెర్ల్, మెట్రోయిడ్ గ్రే మెటాలిక్, సి బెడ్ బ్లూ పెర్ల్ వంటి మూడు రంగుల్లో ఇది లభ్యం కానుంది. అలాగే కొత్తగా స్టైల్ గా ఉండే బెల్టు, వీల్ ఆర్చ్ ప్లానింగ్ వంటివి ఆకర్షణీయంగా ఉండలు ఉన్నాయి. ఎక్స్టీరియర్ లో అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్ కొత్తగా కనిపిస్తుంది. కార్ సైడ్ లో సీల్స్, అల్లాయ్ వీల్స్ బ్లాక్ లో కనిపిస్తాయి.

ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. ఈ కారులో 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం యూనిట్ ను చూడవచ్చు. అలాగే గూగుల్ మ్యాప్స్, google ఇంటిగ్రేషన్ కూడా ఇందులో కనిపిస్తుంది. 10.2 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే సౌకర్యవంతంగా ఉంటుంది. వెంటిలేషన్తో కూడిన లెదర్ సీట్లు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా కారుకు రక్షణ అందిస్తుంది. ఈ కారులో 2.0 లీటర్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ఇంజన్ ఉండనుంది. ఈ ఇంజన 184 పవర్ తో పాటు 315 ఎన్ టార్గను రిలీజ్ చేస్తుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ కారు మార్చి చివరిలో జపాన్లో అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత ఇండియాకు వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటివరకు హోండా కు చెందిన ఎన్నో కార్లు భారతదేశానికి వచ్చి అలరించాయి. అయితే స్టైలిష్ డిజైన్ తో పాటు ప్రీమియం లుక్ లో డ్రైవ్ చేయాలని అనుకునే వారికి హోండా కార్లు ప్రత్యేకంగా ఉండనున్నాయి. అంతేకాకుండా నేటి కాలంలో ఎస్ యు వి కార్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. ఒకవేళ ఈ కారు మార్కెట్లోకి వస్తే ధర రూ.50 లక్షల ప్రారంభ ధరతో ఉండనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular