Homeబిజినెస్Motorola Edge 70 Pro Plus launch date: త్వరలో Motorola Edge 70 Pro+.....

Motorola Edge 70 Pro Plus launch date: త్వరలో Motorola Edge 70 Pro+.. మూడు అప్‌గ్రేడ్‌లు.. వెంటనే తెలుసుకోండి..

Motorola Edge 70 Pro Plus launch date: Motorola మొబైల్స్ కు భారత్ లో మంచి ఆదరణ ఉంది. ఈ కంపెనీ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారిని ఆకర్షించేందుకు కంపెనీ సైతం కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా లేటేస్ట్ గా Motorola Edge 70 Pro+ త్వరలో లాంచ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Edge 70 Pro మీద మూడు ప్రధాన అప్‌గ్రేడ్‌లతో ఇది రానుంది. ఏప్రిల్ 2026లో Edge 70 Proలాంచ్ అయ్యింది. కానీ Pro+ మరింత పవర్‌ఫుల్ చిప్ తో పాటు మెరుగైన కెమెరాలు, ఫాస్ట్ చార్జింగ్‌ ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. మరి ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో చూద్దాం..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Motorola Edge 70 Pro మొబైల్ 6.8 అంగుళాల డిస్ ప్లేతో పనిచేస్తోంది. ఇది 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్‌ప్లే ఇవ్వనుంది. 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 5200 nits బ్రైట్నెస్ ను అందిస్తుంది. MediaTek Dimensity 8500 Extreme చిప్, 50MP ట్రిపుల్ కెమెరా ఈ ఫోన్ సొంతం. 6500mAh బ్యాటరీ ఉంటే.. దీనికి 90W చార్జింగ్ సపోర్టుచేస్తుంది. దీని ధర రూ. ధర రూ. 38,999 (8GB+256GB) నుంచి రూ. 41,999 (12GB+256GB) వరకు విక్రయిస్తున్నారు. ఇది Flipkartలో అందుబాటులో ఉంది.

Edge 70 Pro+ మూడు అప్‌గ్రేడ్‌లు
ఈ ఫోన్ కు కొనసాగింపుగా Pro+లో మూడు అప్ గ్రేడ్ లు రానున్నాయి. మొదటి అప్‌గ్రేడ్ Snapdragon 8s Gen 3 ప్రాసెసర్. ఇది Dimensity 8500 కంటే ఫాస్టర్ CPU/GPU పనిచేస్తుంది. రెండవది మెరుగైన 50MP ఫ్రంట్/రియర్ కెమెరాలు. మూడవది 5000mAh బ్యాటరీతో 125W ఫాస్ట్ చార్జింగ్. ఇప్పటి వరకు ఉన్న మొబైల్ లో 90W కంటే వేగవంతం. అలాగే 6.7 అంగుళాల OLED 144Hz డిస్‌ప్లేతో పాటు 12/16GB RAM, 256/512GB స్టోరేజ్, Android 16తో వస్తుంది.

Pro+ పెర్ఫార్మెన్స్ & ఫీచర్లు
Snapdragon 8s Gen 3తో గేమింగ్, మల్టీటాస్కింగ్ టాప్-క్లాస్, వేపర్ చాంబర్ కూలింగ్‌తో థర్మల్ మేనేజ్‌మెంట్ మెరుగ్గా ఉండనుంది. కెమెరాలు AI లో-లైట్ ఫోటోగ్రఫీలో బెస్ట్ గా ఉండనుంది. 4K 60fps వీడియో అన్ని లెన్సుల్లో తీసుకోవచ్చు. ప్రీమియం డిజైన్ యూత్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. Pantone కలర్స్ లో అందుబాటులో ఉండే Edge 70 Pro+ ధర రూ.39,999 (8GB+256GB) నుంచి రూ.45,000+ (12GB+512GB) ఉండనుంది. మిడ్ రేంజ్ తో పాటు ప్రీమియం సెగ్మెంట్‌లో పోటీ ఇచ్చే ఈ మొబైల్ త్వరలో Flipkart, Motorola.inలో లాంచ్ అవుతుంది. వీటిని కొనుగోలు చేసేవారికి బ్యాంక్ ఆఫర్లు రూ.2,000 తగ్గింపును ఇవ్వనున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular