Motorola Edge 40: Motorola కంపెనీకి చెందిన ఫోన్లకు ఇటీవల ఆదరణ పెరిగిపోతుంది. ఆకర్షణీయమైన డిజైన్తోపాటు.. నేటి తరం వారికి అనుగుణంగా మొబైల్స్ ఉండడంతో చాలామంది ఈ కంపెనీకి చెందిన ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. కంపెనీ సైతం వినియోగదారుల అభివృద్ధిలకు అనుగుణంగా ఫీచర్స్, డిజైన్ ను తయారుచేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. లేటెస్ట్ గా మోటోరోలా ఎడ్జ్ 40 అనే మొబైల్ పై చాలామంది మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు కెమెరా పనితీరు, బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉండడంతో దీనిని మిడ్ రేంజ్ పీపుల్స్ సైతం ఎక్కువగా కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇంతకీ ఈ మొబైల్లో ఉండే ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మోటోరోలా ఎడ్జ్ 40 డిజైన్ అందంగా అందంగా తీర్చి దిద్దపడింది. వంపులు తిరిగి ఉండడంతో చేతిలో పట్టుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. దీని మీద ఉండే ప్యానెల్ ప్రీమియం టచ్ ను కలిగిస్తాయి. ఐపి68 అనే పానెల్ దుమ్ము, ధోలీతోపాటు వాటర్ పడినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్షణగా ఉంటుంది. దీనిపై ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ పడినా కూడా వెంటనే చెరిపి వేసే విధంగా మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది.
ఈ మొబైల్ లో ఉండే డిస్ప్లే వేరే లెవెల్ అనుకోవచ్చు. ఇందులో 6.55 అంగుళాల HD+ POLED డిజైన్ కలిగి ఉంది. ఇవి 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. స్మూత్ స్క్రోలింగ్ తో పాటు.. వీడియోలు క్వాలిటీగా చూడడానికి ఈ డిస్ప్లే అద్భుతంగా పనిచేస్తుంది. నెట్ఫ్లిక్స్ వంటి మూవీస్ చూడడానికి ఇందులో ఉండే HDR +ఫుల్ సపోర్ట్ చేస్తుంది. వాతావరణంతో సంబంధం లేకుండా కావలసిన బ్రైట్నెస్ ను అందిస్తూ వీడియోలు క్వాలిటీగా డిస్ప్లే అవుతాయి.
మోటోరోలా ఎడ్జ్ 40 లో 8020 ప్రాసెసర్ ను చేర్చారు. దీంతో వేగంగా పనులు చేసుకోవాలని అనుకునే వారికి ఈ మొబైల్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో 8 జిబి రామ్, 256 జిబి స్టోరేజ్ ఉండడంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారికి ఈ ఫోన్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే బ్రౌజింగ్, మెసేజింగ్ చేయడంతో పాటు వీడియో కాల్స్ చేసుకునే వారికి సపోర్ట్ గా ఉంటుంది. గేమింగ్ కోసం అయితే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చు.
ఈ మొబైల్లో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పనిచేస్తుంది. అలాగే 13 ఎంపీ అల్ట్రా వైట్ కెమెరా లా ఉంటుంది. ఇది డైనమిక్ కలర్ లతోపాటు కచ్చితంగా ఫోటోలను, వీడియోలను చిత్రీకరిస్తుంది. 32 MP సెల్ఫీ కెమెరా కూడా యూత్ కు అనుగుణంగా ఉంటుంది. ఇందులో4400 mAh బ్యాటరీని ఉంచారు. ఇది 68 వాట్ పాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ పూర్తయి ఎలాంటి సమయం వృధా కాకుండా చేస్తుంది. ఈ మొబైల్ లో 5జి కనెక్టివిటీ వేగవంతంగా ఉంటుంది.