మహిళలకు మోదీ సర్కార్ శుభవార్త.. రూ.లక్ష సంపాదించే అవకాశం?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళల కోసం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలు సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. తాజాగా మోదీ సర్కార్ మహిళలకు తీపికబురు చెప్పింది. మోదీ సర్కార్ మహిళల ఆదాయం పెంపు దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. ల్యాక్‌పతి ఎస్‌హెచ్‌జీ ఉమెన్ పేరుతో కేంద్రం ఒక కార్యక్రమాన్ని ఆవిష్కరించడం గమనార్హం. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ల్యాక్‌పతి ఎస్‌హెచ్‌జీ ఉమెన్ […]

Written By: Kusuma Aggunna, Updated On : November 2, 2021 9:30 am
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళల కోసం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలు సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. తాజాగా మోదీ సర్కార్ మహిళలకు తీపికబురు చెప్పింది. మోదీ సర్కార్ మహిళల ఆదాయం పెంపు దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. ల్యాక్‌పతి ఎస్‌హెచ్‌జీ ఉమెన్ పేరుతో కేంద్రం ఒక కార్యక్రమాన్ని ఆవిష్కరించడం గమనార్హం.

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ల్యాక్‌పతి ఎస్‌హెచ్‌జీ ఉమెన్ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా కేంద్రం మహిళలు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు సంపాదించే విధంగా ప్రణాళికకను సిద్ధం చేస్తోంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ స్కీమ్ ద్వారా రాబోయే రెండు సంవత్సరాలలో రెండున్నర కోట్ల మంది గ్రామీణ స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు జీవనోపాధి కల్పించనుందని తెలుస్తోంది.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన పేద మహిళల యొక్క ఆదాయంతో పాటు జీవన ప్రమాణాలను పెంపొందించడానికి సిద్ధమైందని తెలుస్తోంది. కేంద్రం నిర్ణయాల వల్ల మహిళలు ఆర్థికంగా మరింత ఉన్నత స్థితికి ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 70 లక్షల కంటే ఎక్కువమంది మహిళలు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లో భాగంగా స్వయం సహాయక గ్రూపులలో భాగస్వాములు అయ్యారని తెలుస్తోంది.

మహిళలకు జీవనోపాధి కల్పించడం ద్వారా మహిళలు సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం గమనార్హం. కేంద్రం అమలు చేస్తున్న పథకాల వల్ల మహిళలకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.