Kajal agarwal: సిగరెట్, ఆల్కహాల్, గుట్కా, ఖైనీ వంటి ఉత్పత్తుల ప్రమోషన్స్ ని భారత ప్రభుత్వం నిషేధించింది. ప్రింట్. ఎలక్ట్రానిక్ మీడియాలో వీటి ప్రచారంపై నిషేధం ఉంది. ఇక సినిమాలో దమ్ముకొట్టే, మందు తాగే సన్నివేశాలుంటే… సినిమా ప్రారంభంలో కచ్చితంగా చెప్పాల్సిందే. అలాగే, ఆయా సన్నివేశాల్లో తెరపై ఆ అక్షరాలు పడాల్సిందే. సొసైటీలో ఓ ఇమేజ్ ఉన్న తారలు కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా తినే తిండి, కట్టే బట్ట, అలవాట్ల విషయంలో ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళను చూసి ప్రభావితం అయ్యేవారు, అనుకరించేవారు అనేక మంది ఉంటారు.
నటీనటుల్లో చాలామంది మందు, సిగరెట్ వంటి వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది మాత్రమే నటిస్తున్నారు. ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. సోషల్ మీడియాలో లిక్కర్ బ్రాండ్ ప్రమోషన్ ను మొదలెట్టారు. లిక్కర్ బ్రాండ్ గురించి ఓ పోస్ట్ చేస్తే… ఫాలోవర్లను బట్టి వారికి పారితోషికం ముడుతుంది. పలువురు సెలబ్రిటీలు ఆ తరహా పోస్టులు చేయడం చూశాం. అయితే ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఈ లిస్ట్ లోకి ఎంటరయ్యారు.
తాజాగా కాజల్ ఆల్కహాల్ బ్రాండ్స్ లో ఒకటైన టీచర్స్ ఫిఫ్టీని ప్రోమోట్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. టీచర్స్ ఫిఫ్టీ అత్యుత్తమమైన స్కాచ్ విస్కీ, మీ పండుగను టీచర్స్ ఫిఫ్టీ విస్కీతో జరుపుకోండి, అంటూ కామెంట్ చేశారు. భర్తతో పాటు ఈ బ్రాండ్ ని ప్రోమోట్ చేసిన కాజల్, గుడ్డిలో మెల్లలా, పరిమితిగా తాగండి, అది కూడా 25ఏళ్ల వయసు పై పడినవారు మాత్రమే, అని చిన్న సలహా పడేసింది.మరి కాజల్ లాంటి లక్షల మంది అభిమానులున్న ఒక స్టార్ హీరోయిన్ ఒక ఆల్కహాల్ బ్రాండ్ ని పబ్లిక్ గా ప్రమోట్ చేయడం అంటే చింతించాల్సిన విషయమే. డబ్బుల కోసం ఇటువంటి చర్యలకు పాల్పడడం నిజంగా ఖండించాల్సిన అవ్సరామ్ ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.