Mobile exports 2026 Q1 slowdown: భారతదేశంలోఉత్పత్తి అయిన వివిధ కంపెనీలకు చెందిన మొబైల్స్ ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. వీటిలో అమెరికా, యూరప్ మధ్య ప్రాచీన దేశాలు ఉన్నాయి. అయితే కొన్ని కారణాలవల్ల భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే ఫోన్లు 3 శాతం తగ్గినట్లు ‘కౌంటర్ పాయింట్ రీసెర్చ్’ పేర్కొంది. మొబైల్స్ లో ఉపయోగించే మెమొరీ కి సంబంధించిన ధరల పెరుగుదల, ఫోన్లపై వినియోగదారుల డిమాండ్ తగ్గిపోవడం వంటివి ఎగుమతులు క్షీణించినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కంపెనీలు మాత్రం భారతదేశంలో తమ శాతాన్ని పెంచుకున్నాయి. వీటిలో ఏ ఫోన్ ఎలాంటి స్థానంలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఇండియాకు సంబంధించిన స్మార్ట్ ఫోన్ త్రైమాసిక ఫలితాలకు సంబంధించిన నివేదికను బయటపెట్టింది. నీ నివేదిక ప్రకారం.. భారతదేశ స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో మూడు శాతం క్షీణించినట్లు పేర్కొంది. ఇది గత ఆరేళ్ల కాలంలో అత్యంత బలహీనమైన తగ్గుదల అని పేర్కొంది. ఒకవైపు సరఫరా ఖర్చులు పెరగడం.. స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగడం.. ఇదే సమయంలో వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడం కారణంగా ఎగుమతులు తగ్గాయని తెలుపుతోంది.
ఒకవైపు స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు తగ్గినప్పటికీ భారతదేశంలో మాత్రం కొన్ని కంపెనీలు తమ వాటా శాతాన్ని పెంచుకున్నాయి. వీటిలో అత్యధికంగా Vivo కంపెనీ ఈ త్రైమాసికంలో 21 శాతం వాటాను ఏర్పాటు చేసుకొని అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో V సిరీస్ కు సంబంధించిన ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత శాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ A 07 , గెలాక్సీ A 36, గెలాక్సీ A మొబైల్స్ అమ్మకాల్లో వృద్ధి సాధించాయి. దీంతో ఈ కంపెనీ 20%తో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత OPPO కంపెనీ 14% వాటాతో మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఈ కంపెనీకి చెందిన A, K సిరీస్ లకు చెందిన మొబైల్స్ ఎక్కువగా విక్రయాలు జరుపుకున్నాయి. చైనీస్ టెక్ బ్రాండ్ 8 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా ఈ మొబైల్స్ ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి.
Xiaomi కంపెనీ 7.9%తో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీకి చెందిన Q 1 2026 మొబైల్ అత్యధికంగా సేల్స్ నమోదు చేసుకుంది. అలాగే దీని సబ్ బ్రాండ్ అయిన POCO కంపెనీ 4.8%తో మొత్తం 13 శాతానికి పైగా వాటాన్ని కలిగి ఉంది. ఆ తర్వాత రియల్ మీ కంపెనీకి చెందిన P3 Light, Nargo 80 ఎలైట్ మొబైల్ కు డిమాండు ఎక్కువగా ఉండడంతో ఈ కంపెనీ 11% వాటాను కలిగి ఉంది.
ఈ సందర్భంగా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో మొబైల్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని తెలిపారు. రాబోయే కాలంలో కూడా మొబైల్స్ తగ్గే అవకాశం ఉందని అన్నారు. ఈ త్రైమాసికంలో మూడు శాతం క్షీణించినా.. మొత్తం ఆర్థిక వ్యవస్థ పూర్తయ్య వరకు 10% వరకు ఉంటుందని పేర్కొన్నారు.