https://oktelugu.com/

Darshan: స్టార్ హీరోని వేధిస్తున్న ఆత్మ.. అర్థరాత్రులు కేకలు.. నన్ను రక్షించండి అంటూ పోలీసులను బ్రతిమిలాడుతున్న హీరో!

అభిమానిని హత్య చేసిన కన్నడ నటుడు దర్శన్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఇన్నాళ్లూ ఎలాంటి భయం, పశ్చాత్తాపం లేకుండా ఉన్న నటుడు.. ఇప్పుడు భయంతో వణుకుతున్నాడు

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 5, 2024 / 04:09 PM IST

    Darshan(2)

    Follow us on

    Darshan: తన ప్రియురాలిపై అసభ్యరంగా పోస్టుపెట్టాడన్న కోపంతో అభిమానినే హత్య చేశాడు కన్నడ హీరో దర్శన్‌. ఈ ఘటన కర్ణాటకలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో అరెస్ట్‌ అయిన దర్శన్‌ను కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మొన్నటి వరకు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్నాడు. అయితే అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కోర్టు అతడిని బల్లారి జైలుకు తరలించాలని ఆదేశించింది. ప్రస్తుతం బల్లారి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. అయితే అక్కడ కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని హీరో దర్శన్‌ జైలు అధికారులకు తెలిపాడు. తనను బెంగళూరు జైలుకు తరలించాలని వేడుకుంటున్నాడు.

    వెంటాడుతున్న ఆత్మ..
    అభిమాని రేణుస్వామి ఆత్మ తనను వెంటాడుతుందని దర్శన్‌ జైలు అధికారులకు తెలిపాడు. కలలోకి వచ్చి భయపెడుతోందని, భయంలో తనకు నిద్ర పట్టడం లేదని జైలు అధికారులకు చెప్పాడట. తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనను బెంగళూరు జైలుకి తరలించాలని వేడుకున్నాడు. మరోవైపు బల్లారి జైల్లో ఉన్న ఇతర ఖైదీలు కూడా దర్శన్‌ రాత్రి జైల్లో కలవరిస్తున్నాడని, గట్టిగా కేకలు వేస్తున్నాడని జైలు అధికారులకు తెలిపినట్లు తెలిసింది.

    ప్రియురాలి కోసం హత్య..
    ఇదిలా ఉంటే,, దర్శన్, తన ప్రియురాలిని సోషల్‌ మీడియాలో రేణుస్వామి కామెంట్‌ చేశాడని ఈ హత్య చేశాడు. తన అనుచరులతో రేణుస్వామిని పిలిపించుకుని తన ఫామ్‌హౌస్‌లో చంపేసి, రోడ్డు పక్కన కాలువలో పడేయించాడు. ఈ సందర్భంగా దర్శన్‌ రేణుస్వామిని తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. రేణుస్వామిని తీవ్రంగా కొట్టినట్లు, కరెంటు సాక్‌ పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో తెలిపింది. పోలీసుల విచారణలో కూడా దర్శన తానే హత్య చేశానని అంగీకరించినట్లు తెలిసింది. ఈ కేసులో దర్శన్‌తోపాటు అతని ప్రియురాలు పవిత్రగౌడతో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.