Milage Scooters:దేశంలో ద్విచక్రవాహనాల వినియోగం పెరిగిపోతుంది. కొన్ని అవసరాల నిమిత్తం విద్యార్థుల నుంచి వ్యాపారాలు చేసేవారు టూవీలర్స్ కొనుగోళ్లపై ఎక్కవగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవల కాలంలో బైక్స్ కంటే స్కూటర్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతుంది. ఇవి పురుషులతో పాటు మహిళలు డ్రైవ్ చేసేందుకు అనుగుణంగా ఉండడంతో పాటు సామగ్రి కోసం వినియోగించేవారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని స్కూటర్లు అత్యధిక మైలేజ్ ఇవ్వడంతో వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దేశ వ్యాప్తంగా అత్యధిక మైలేజ్ ఇచ్చే కిలోమీటర్లు ఇచ్చే వాహనాల గురించి తెలుసుకోవాలని ఉందా?
యమహా బైక్స్ గురించి తెలియని వారుండరు. ఈ కంపెనీ నుంచి లేటేస్ట్ గా రే ZX 125 బైక్ మార్కెట్లోకి వచ్చింది. ఇది 125 సీసీ ఇంజిన్ ను కలిగి హైబ్రిడ్ పవర్ తో పనిచేస్తుంది. ఇందులో 6.0 కేడబ్ల్యూ పవర్ ను అందిస్తుంది. 10.3 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసిన ఈ స్కూటర్ ధర రూ.85.030 ఉంది. ఇది లీటర్ కు 49 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
టీవీఎస్ నుంచి Ntorq 125 బెస్ట్ మైలేజ్ బైక్ గా నిలిచింది. ఇది 125 సీసీ ఇంజిన్ తో పనిచేస్తుంది. 9.25 బీహెచ్ పీ పవర్ తో పనిచేసే ఇది 41.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. గంటకు 95 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లే ఈ స్కూటర్లు 5 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. దీనిని రూ.84,636 తో విక్రయిస్తున్నారు.
సుజుకీ నుంచి ఇప్పటికే చాలా మోడళ్లు మార్కెట్లో ఉన్నాయి. దీని నుంచి యాక్స్ 125 4 స్ట్రోక్ స్కూటర్ అలరిస్తోంది. ఇందులో 1 సిలివండర్ కూల్డ్ ఇంజిన్ పవర్ ను కలిగి ఉంది. 8.7 బీహెచ్ పీ పవర్ వద్ద 10 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంి. ఇందులో 5 లీటర్ల పెట్రోల్ ఫ్యూయెల్ కు అవకాశం ఉంది. దీనిని రూ.82,144 తో విక్రయిస్తున్నారు.
హీరో కంపెనీ నుంచి కొత్త బైక్ జీరో 3 స్ట్రోక్ స్కూటర్ అందుబాటులో ఉంది. దీనిని రూ.71,484 తో విక్రయిస్తున్నారు. ఇందులో 8.05 బీహెచ్ పీ పవర్ వద్ద 8.70 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ప్రత్యేకంగా నిలుస్తుంది.
హోండా కంపెనీ నంచి గాడ్ అనే స్కూటర్ మార్కెట్లో ఉంది. ఇది 5.78 బీహెచ్ పీ పవర్ తో పాటు 9.03 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5.3 లీటర్ల ఫ్యూయెల్ స్టోరేజీకి అవకాశం ఉంది. దీనిని రూ.74,235 తో విక్రయిస్తున్నారు. ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్ కు 48 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.