Microsoft CEO Satya Nadella: సార్ మీ కృతజ్ఞతలు మా కక్కర్లేదు: మైక్రో సాప్ట్ సీఈవోకు ఎంత కష్టం వచ్చింది

కంపెనీ విలువ 2.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ ఆ సంస్థ ఉద్యోగుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. తమ జీతాలు పెంచడం లేదని సంస్థపై, సంస్థ సీఈఓ పై ఉద్యోగులు గుర్రుగా ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి.

Written By: Bhaskar, Updated On : July 3, 2023 9:38 am
Follow us on

Microsoft CEO Satya Nadella: ఆర్థికమాంద్యం వల్ల ఐటీ పరిశ్రమ తీవ్ర ఓడితుడు ఎదుర్కొంటోంది. భారత్ నుంచి అమెరికా వరకు చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయి. డబ్బుల చెల్లింపులు కష్టంగా మారడంతో వివిధ కంపెనీలు ఉత్తమ తదుపరి భవిష్యత్తు లక్ష్యాలకు సంబంధించి కోతలు విధించాయి. అంతేకాదు మరో రెండు ఏళ్ల వరకు కొత్త నియామకాలు చేపట్టకూడదని నిర్ణయానికి వచ్చాయి. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులందర్నీ కార్యాలయాలకు పిలుస్తున్నాయి. అయితే ఇంతటి గడ్డు పరిస్థితుల్లోనూ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గణనీయమైన లాభాలను సాధించింది. స్టాక్ మార్కెట్లో కంపెనీ స్టాక్స్ సరికొత్త ఆల్ టైం కరిష్టానికి చేరుకొని సరికొత్త రికార్డు సృష్టించాయి. ఫలితంగా కంపెనీ విలువ ఏకంగా 2.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది.

విలువ పెరిగినప్పటికీ

కంపెనీ విలువ 2.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ ఆ సంస్థ ఉద్యోగుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. తమ జీతాలు పెంచడం లేదని సంస్థపై, సంస్థ సీఈఓ పై ఉద్యోగులు గుర్రుగా ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. అమెరికా కేంద్రంగా ప్రచురితమయ్యే పలు పత్రికలు ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. ఇక ఇటీవల మైక్రోసాఫ్ట్ సాధించిన ఫలితాలపై సత్య నాదెళ్ల ఉద్యోగులకు అంతర్గత సందేశాలు పంపించారు. అందులో ఈ ఏడాదిలో మెరుగైన పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులపై ప్రశంసల జల్లు కురిపించారు. సృజనాత్మకత, వినూత్నం అనే విధానాల వల్లే సంస్థ ఈ స్థాయిలో ఫలితాలు సాధించిందని కొనియాడారు. క్లయింట్లు, భాగస్వాములు కూడా తమ వంతు పాత్ర పోషించారని అభినందనలతో ముంచెత్తారు. వచ్చే ఏడాది సైతం మెరుగైన ఫలితాలు సాధించాలని కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించాలని పిలుపునిచ్చారు.

కంపెనీ సీఈవో తమను అభినందనలతో ముంచెత్తుతున్నప్పటికీ ఉద్యోగులకు అది ఏమాత్రం ఆనందాన్ని కలిగించడం లేదు. సత్య నాదెళ్ళ పంపిన ఇంటర్నల్ మెసేజ్ ను వేలాది మందికి పైగా వీక్షించారు. అయితే వీరిలో ఒక 130 మంది ఉద్యోగులు మాత్రమే సానుకూలంగా స్పందించారు. మిగతావారు అసహనం వ్యక్తం చేశారు. కృతజ్ఞతలు తెలుపుడం అంటే ఇలాగేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పంచకుండా థాంక్యూ నోట్ పంపిస్తే ఎలా ఉంటుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంస్థ గడిచిన లాభాల గురించి మాట్లాడుతూ జీతాలు పెంచకుండా అడ్డుకున్న సీనియర్ స్థాయి ఉద్యోగులపై ఓ ఉద్యోగి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. కంపెనీ, ఉన్నత స్థాయి ఉద్యోగులు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్థిస్తున్నప్పుడు.. ఉద్యోగులు మాత్రమే వేతనాల కొరత ఎదుర్కొంటున్నారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.