Homeబిజినెస్MG Hector : ఎంజీ హెక్టర్ కొత్త మోడల్ లాంచ్.. హ్యుందాయ్ క్రెటాకు పెద్ద షాకే...

MG Hector : ఎంజీ హెక్టర్ కొత్త మోడల్ లాంచ్.. హ్యుందాయ్ క్రెటాకు పెద్ద షాకే !

MG Hector : ఎంజీ మోటార్ ఇండియా తన అత్యంత పాపులర్ మోడల్ ఎస్యూవీ హెక్టర్ సరికొత్త 2025 మోడల్‌ను విడుదల చేసింది. కొత్త మోడల్ ఇప్పుడు E20 పెట్రోల్ ఫ్యూయల్ కెపాసిటీతో వస్తుంది. దీని ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.13.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఎంజీ హెక్టర్ టాటా హారియర్, మహీంద్రా XUV700, స్కార్పియో N వంటి ఇతర SUVలకు పోటీగా నిలుస్తుంది. ముఖ్యంగా తక్కువ, మీడియం రేంజ్ వేరియంట్‌లలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కు కూడా ఇది పోటీదారు. ఎంజీ హెక్టర్ 5 సీట్ల వేరియంట్‌లో వస్తుంది. అయితే దీని 6, 7-సీట్ల లేఅవుట్ ఎంజీ హెక్టర్ ప్లస్‌గా అందుబాటులో ఉంది.

Also Read : ఎలక్ట్రిక్ కార్లలో టాప్.. సేఫ్టీలో టాటాకు తిరుగులేదు.. మరోసారి రుజువైంది

ఎంజీ భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు విడుదల చేసిన మొదటి SUV హెక్టర్. ఈ SUV అతి తక్కువ సమయంలో చాలా పాపులారిటీ సాధింది. ఎంజీ ఒక ప్రముఖ బ్రాండ్‌గా ఎదిగింది. హెక్టర్ తన ప్రీమియం డిజైన్, టెక్నాలజీతో నిండిన క్యాబిన్‌తో వస్తుంది. ఇందులో 14 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, లెవెల్ 2 ADAS కూడా ఉన్నాయి. హెక్టర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆఫ్షన్లలో అందుబాటులో ఉంది.

ఎంజీ హెక్టర్ ఫీచర్లు
ఎంజీ హెక్టర్‌లో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 14 ఇంచుల టచ్‌స్క్రీన్, 7 ఇంచుల కంప్లీట్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8 స్పీకర్ల సౌండ్ సిస్టమ్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉన్నాయి. ముందు రెండు సీట్లు ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ వెంటిలేషన్ కూడా ఉంది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి.

ఎంజీ హెక్టర్ మైలేజ్
ఎంజీ హెక్టర్ రెండు ఇంజన్ ఆఫ్షన్లతో వస్తుంది. ఇందులో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, మరింత పవర్ ఫుల్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. SUV మైలేజ్ గురించి కంపెనీ అధికారికంగా ఎప్పుడూ చెప్పనప్పటికీ, హెక్టర్ ఇంధనం ప్రకారం 12-16 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఎంజీ హెక్టర్‌లో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read : షోరూమ్ లకు వచ్చేసిన క్రెటా ఈవీ, కర్వ్‌ ఈవీకి శత్రువు

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version