Technology : ఈ కొత్త షెన్‌క్సింగ్ బ్యాటరీ టెక్నాలజీ ద్వారా కేవలం 5 నిమిషాల్లో 520 కిలోమీటర్ల రేంజ్ కోసం ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. అంటే ప్రతి సెకనుకు 2.6 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ పెరుగుతుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీ కంటే దాదాపు రెండింతలు ఎక్కువ. BYD అత్యంత వేగవంతమైన కొత్త 1-మెగావాట్ సిస్టమ్ బ్యాటరీని 10 నిమిషాల్లో 400 కిలోమీటర్ల కోసం ఛార్జ్ చేయగలదు. CATL టెక్నాలజీ సంప్రదాయ ఛార్జింగ్ విధానాల కంటే రెండింతలు వేగంగా ఉందని అర్థం చేసుకోవచ్చు.
Also Read : ఎంజీ హెక్టర్ కొత్త మోడల్ లాంచ్.. హ్యుందాయ్ క్రెటాకు పెద్ద షాకే !
-10°C ఉష్ణోగ్రతలో కూడా ఛార్జ్ అయ్యే బ్యాటరీ
CATL కొత్త బ్యాటరీ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే, ఇది చల్లని ఉష్ణోగ్రతలలో కూడా మన్నికైనది. -10°C ఉష్ణోగ్రతలో కూడా బ్యాటరీని కేవలం 15 నిమిషాల్లో 5 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. చాలా ఎక్కువ చలి ఉండే ప్రాంతాలకు ఈ టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి ప్రదేశాలలో చాలా తక్కువ ఉష్ణోగ్రత కారణంగా ఛార్జింగ్ స్పీడ్, రేంజ్ తరచుగా తగ్గుతాయి. అంతేకాకుండా, ఈ టెక్నాలజీ కామన్ అయితే ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందనే కారణంతో EVలను కొనడానికి వెనుకాడుతున్న వ్యక్తులను కూడా ఎలక్ట్రిక్ కార్లు కొనడానికి ప్రోత్సహిస్తుంది. ఒక కారు 10 లేదా 15 నిమిషాల్లో ఛార్జ్ అయితే, ఇది కారులో పెట్రోల్ లేదా డీజిల్ నింపడానికి పట్టే సమయానికి సమానంగా ఉంటుంది.
డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్న కంపెనీ
CATL ఎలక్ట్రిక్ వాహనాల కోసం డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్‌పై కూడా పనిచేస్తోంది. ఈ రెండు డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్‌లు రాబోయే 2 లేదా 3 మూడేళ్లలో ఎలక్ట్రిక్ కార్లలో రాబోతున్నాయి. దీని కారణంగా షెన్‌క్సింగ్ బ్యాటరీల రేంజ్ రెండింతలు అంటే 1500 కిలోమీటర్ల వరకు చేరుకోగలదు. ప్రస్తుత షెన్‌క్సింగ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగా 30 నిమిషాల్లో 30 నుంచి 80 శాతం ఛార్జ్ చేయగలదు.
మరింత సేఫ్ బ్యాటరీని రూపొందించిన బ్రాండ్
అంతేకాకుండా, తన ఇన్నోవేషన్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేస్తూ CATL డిసెంబర్ 2025 నుంచి FAW ట్రక్కుల కోసం ‘నెక్స్‌ట్రా’ పేరుతో బ్రాండెడ్ సోడియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. ఈ బ్యాటరీలు అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా మన్నికగా ఉంటాయి. వాటి సామర్థ్యంలో 90 శాతం వరకు నిలుపుకుంటాయి. ఎక్కువ సేఫ్టీ, తక్కువ ధరలతో ఈ బ్యాటరీలు హైబ్రిడ్ కార్లలో లెడ్-యాసిడ్ లేదా లిథియం బ్యాటరీల స్థానాన్ని భర్తీ చేయగలవు.