Tata Nexon : భారతీయ కార్ల సేఫ్టీ ప్రమాణాలను పరీక్షించే సంస్థ భారత్ NCAP, టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెర్షన్, నెక్సాన్ ఈవీ 45 kWh వేరియంట్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. ఈ ఎలక్ట్రిక్ కారు తాజా మోడల్ ఇది. దీనిని తర్వాత నెక్సాన్ లైనప్‌లో చేర్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఈ ఎలక్ట్రిక్ కారు పెద్దల, పిల్లల భద్రత రెండింటిలోనూ 5స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ ఎలక్ట్రిక్ SUV విడుదలైనప్పటి నుంచి ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.
Also Read : టాటా నెక్సాన్ ఈవీ టెస్టులో పాస్ అయిందా.. నిజంగా కంపెనీ చెప్పినంత రేంజ్ ఇస్తుందా ?
టాటా నెక్సాన్ ఈవీ 45, 45 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ నెక్సాన్ ఈవీ మోడల్ ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 330 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. MIDC ప్రకారం 489 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని టాటా మోటార్స్ పేర్కొంటుండగా, C75 రేంజ్ 350 నుండి 375 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపింది. అయితే, డ్రైవింగ్ రేంజ్ డ్రైవింగ్ చేసే విధానంపై కూడా ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి వేరే వ్యక్తి ఎక్కువ రేంజ్ కూడా పొందవచ్చు. ముఖ్యంగా వాలుగా ఉండే రోడ్లు ఉంటే ఎక్కువ రేంజ్ లభిస్తుంది. అదే సమయంలో ఎత్తుగా ఉండే రోడ్లు ఉంటే రేంజ్ తగ్గుతుంది.
నెక్సాన్ ఈవీ స్పీడ్
నెక్సాన్ ఈవీ 45 అనేక లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 45 kWh బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే అందుబాటులో ఉండే పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. ముందు బోనెట్ కింద సామాను ఉంచడానికి కూడా స్పేస్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ను కలిగి ఉంది. కారు మోటార్ 142 bhp పవర్, 215 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 8.9 సెకన్లలో 0-100 కిమీ/గం స్పీడ్ అందుకుంటుంది.
నెక్సాన్ ఈవీ ఫీచర్లు
పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన టాటా నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్ అవతార్‌లో కూడా అందుబాటులో ఉంది. దీని ధర స్టాండర్డ్ పెర్సోనా కంటే రూ.20,000 ఎక్కువ. నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్ టాప్ మోడల్ ఎంపవర్డ్+ పెర్సోనాలో మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తంమీద టాటా నెక్సాన్ ఈవీ 45 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ క్రియేటివ్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ పెర్సోనా ఎంపికలలో అందుబాటులో ఉంది. నెక్సాన్ ఈవీ ఒక ఎలక్ట్రిక్ SUV, ఇది అద్భుతమైన రేంజ్, స్పీడ్, తగినంత స్పేస్ కలిగి ఉంది. అదనంగా, మంచి డ్రైవింగ్, హ్యాండ్లింగ్, ఎట్రాక్టీవ్ డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి లేటెస్ట్ సౌకర్యాలు ఈ కారును వినియోగదారుల బెస్ట్ ఆఫ్షన్ గా నిలిపాయి.
Also Read : ఎగబడి కొంటున్నారు.. ఈ కారు గురించి తెలుసా?