Karthik Subbaraj : కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) మంచి డిఫరెంట్ స్టైల్ ఉన్న డైరెక్టర్. హీరో తో సంబంధం లేకుండా ఈయన సినిమాలను థియేటర్స్ కి వెళ్లి చూసే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ రైటింగ్, న్యారేషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రానికి కథ ని అందించింది ఈయనే. ఆ సినిమా విడుదల అవ్వకముందు శంకర్(Shankar Shanmugham) లాంటి లెజండరీ డైరెక్టర్ సినిమాకు కథని అందించే గొప్ప అవకాశం నాకు దక్కడం అదృష్టం గా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తన మాటని మార్చేశాడు. రీసెంట్ గా ఆయన సూర్య తో ‘రెట్రో’ అనే చిత్రం చేసాడు. వచ్చే నెల 1వ తేదీన ఈ చిత్రం ప్రేక్షహకుల ముందుకు రాబోతుంది.
Also Read : డ్రామాలు ఆడొద్దు అంటూ సాయి పల్లవి కి నెటిజెన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ‘గేమ్ చేంజర్’ ప్రస్తావన వచ్చింది. దీని గురించి ఆయన మాట్లాడుతూ ‘నేను ఆ చిత్రానికి కేవలం ఒక్క స్టోరీ లైన్ ని మాత్రమే అందించాను. చాలా గ్రౌండెడ్ గా, నిజాయితితో నడుచుకునే ఒక IAS ఆఫీస్, రాష్ట్రంలో అధికార పార్టీ కి ఎదురుగా నిలబడి, వాళ్ళ అక్రమాలను ఎలా అడ్డుకున్నాడు అనే లైన్ ని మాత్రమే నేను చెప్పాను. దానిని వేరే రచయితలూ డెవలప్ చేసి, చివరికి అలాంటి ఔట్పుట్ వచ్చేలా చేసారు. ఆడియన్స్ కి మంచి సినిమాని ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఎవరైనా పని చేస్తారు. కానీ సక్సెస్, ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదు, జనాల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనం ఏమి చెయ్యలేం’ అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్ సుబ్బరాజ్. ఈ వ్యాఖ్యలపై రామ్ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
విడుదలకు ముందు ఈ చిత్రం క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి, స్టోరీ మొత్తం నాదే అని చెప్పుకొని తిరిగావు, ఇప్పుడు ఫలితం తేడా కొట్టేసరికి నాది కాదు అంటున్నావు, ఇదెక్కడి న్యాయం?, నీ కొత్త సినిమా విడుదల మరో వారం రోజుల్లో ఉంది కాబట్టి, దానిపై ఎలాంటి ప్రభావం చూపకూడదు అన్న ఉద్దేశ్యంతోనే కదా ఇలా మాటలు మారుస్తున్నావు అంటూ కార్తీక్ సుబ్బరాజ్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇక ఆయన దర్శకత్వం వహించిన రెట్రో విషయానికి వస్తే, ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ తోనే జనాలను ఆకట్టుకుంది. ‘కన్నిమ్మ’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. సెన్సార్ రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో భారీ కం బ్యాక్ ఇస్తాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
Also Read : మహేష్ సినిమా కోసం ఖైరతాబాద్ RTO ఆఫీస్ కి వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి!