Skoda Slavia : సాధారణంగా కార్లకు నిత్యం డిమాండ్ ఉంటుండడంతో వీటి ధరలు పెరుగుతూనే ఉంటాయి. కొత్త ఏడాది సందర్భంగా ఈ ఏడాది ప్రారంభంలో చాలా కార్ల ధరలు పెరిగాయి. అయితే కొన్ని సార్లు కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి కార్ల ధరలు తగ్గిస్తూ ఉంటాయి. గతంలో మంచి డిమాండ్ ఉన్న ఓ కారును రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి మార్పులు చేయకుండానే మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో ఈ ఫీచర్స్ బాగా నచ్చే ఈ కారును కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ కారు ఏదీ? ఇది ఏ కంపెనీకి చెందినది? ఆ వివరాల్లోకి వెళితే..
Also Read : ‘బ్రాండ్’ ఈజ్ బ్యాక్.. ఆ కారు మళ్లీ వస్తోంది.. రెడీగా ఉండండి..
చెక్ రిపబ్లిక్ కు చెందిన SCODA కంపెనీ గురించి కారు వినియోగదారులకు తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ కార్లు భారత్ లో ఎక్కువగా ఆదరణ పొందాయి. అయితే ఈ కంపెనీ నుంచి ఆక్టేవియా, సూపర్బ్, రాపిడ్ వంటి కార్లను భారత మార్కెట్లోకి వచ్చాయి. ఇవి సెడాన్ వేరియంట్ కు చెందినవి. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఎస్ యూవీ కార్లను కోరుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ కంపెనీకి చెందిన Slavia మిడ్ సైజ్ సెడాన్ సేప్టీ కారు ను మార్కెట్లోకి తీసుకొస్తోంది.
ఈ కారు సెడాన్ వేరియంట్ అయినప్పటికీ లగ్జరీ మోడల్ ను కలిగి ఉంటుంది. ఇందులో ప్రయాణిస్తే అనూభూతి వేరే లెవల్లో ఉంటుంది. తక్కువ ధరలో లగ్జరీ కార్లలో ప్రయాణం చేయాలనుకునేవారు ఈ కారును కోరుకుంటారని కంపెనీ భావిస్తోంది. అందువల్ల 2025 మోడల్ ను తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే 2023 -24 మార్కెట్లోకి వచ్చిన ఈ కారును తిరిగి 2025 మోడల్ గా ప్రవేశపెట్టింది. కానీ ఇందులో ఇంజిన్, ఫీచర్స్ వంటివి మార్చలేదు. మరి ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాంటే?
Scoda Slaviaకారులో 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ ను అమర్చారు. ఇందులో 3.5 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. లెదర్ కోట్ స్టీరింగ్ వీల్ తో పాటు వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, కూల్డ్ గ్లోవ్ బాక్స్ ఉన్నాయి. సౌండింగ్ కోసం 8 స్పీకర్లు అందుబాటులో ఉంటాయి. ఆటోమేటిక్ క్లైమేట్ చేంజ్ అవుతూ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే క్రూయిజ్ కంట్రోల్, రిమోట్ ఇంజిన్ స్ట్రార్ట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా ఆకర్షిస్తుంది. ఇందులో LED టెయిల్ లైట్లతో పాటు, డోర్ హ్యాండ్సిల్స్ పై క్రోమ్ యాక్సెంట్స్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఈ కారు నిన్నటి వరకు రూ.10.69 లక్షల ప్రారంభ ధరతో విక్రయించారు. అయితే ఇప్పుడుే దీనిిన రూ.10.34 లక్షలతో అందిస్తున్నారు. అంటే మొత్తంగా దీనిపై రూ.35,000లను తగ్గించారు. ఈ కారు క్లాసిక్, సిగ్నేచర్, స్పోర్ట్ లైన్, మోంటే కార్లో, ప్రెస్టీజ్ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.
Also Read : లగ్జరీ లుక్, హైటెక్ ఫీచర్లతో నాటి రాజసం.. అంబాసిడర్ మరోసారి మార్కెట్లోకి వచ్చేస్తోంది