MG Comet Electric Car: కారు ఒకప్పుడు సంపన్నుల వాహనం.. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ నిత్యావసరం. దీంతో కార్ల అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించడానికి కార్ల తయారీ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా కొత్త ఏడాది ప్రారంభంలోనే ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఎంజీ భారీ డిస్కైంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ పోతే మళ్లీ రావడం కష్టం. మరి ఆ ఆఫర్ ఏంటో చూద్దాం.
ఈవీలకు డిమాండ్..
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో.. చాలా మంది ఇప్పుడు ఈవీ(ఎలక్ట్రిక్ కార్లు) కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో కస్టమర్స్ ఆసక్తిని క్యాచ్ చేస్తూ కొత్త కొత్త మార్పులతో మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి మోటార్ సంస్థలు. ఈ క్రమంలో గతేడాది లాంచ్ అయింది ఎంజీ కామెట్. ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్ పరంగా జనాన్ని అట్రాక్ట్ చేసింది. సిటీ పరిధిలో, మిడిల్ రేంజ్ నగరాల్లో వినియోగానికి సరిపోతుండడంతో మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మంచి ఆదరణ ఉన్న ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు తెచ్చుకుంది.
ధర కూడా తక్కువే..
ఎంజీ కామెట్ కారు ధర కూడా తక్కువగానే ఉంది. ఎక్కువగా అమ్మకాలు జరగడానికి ఇది కూడా ఓ కారణం. ఈ క్రమంలో కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు కొత్త సంవత్సరంలోనే సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. కారు ధరను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
రూ.లక్ష డిస్కౌంట్..
గతేడాది ధరతో పోలిస్తే.. ప్రస్తుత సంవత్సరం ఈ కారు ధరను ఎంజీ సంస్థ రూ.లక్ష తగ్గించింది. ఈ ఎలక్ట్రిక్ కారు లాంచింగ్ సమయంలో దీని బేస్ ధర రూ.7.98గా నిర్ణయించింది. తాజా తగ్గింపుతో బేసిక్ మోడల్ ధర రూ.6.99 లక్షలకు తగ్గింది. చూడడానికి ఆకర్షణీయంగా ఉన్న ఈ ఎంజీ కారులో అత్యాధునిక ఫీచర్లు, సౌకర్యాలు ఉన్నాయి. సిటీ పరిధిలో ట్రావెల్ చేసేవారికి ది మంచి ఆప్షన్. ఈ ఎంజీ కారు.. 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో ఉంది. ఒకసారి చార్జింగ్ పెడితే 230 కిలోమీటర్లు నడుస్తుంది. కంపెనీ దీనిలోని రియర్–యాక్సిల్–మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది 42 బీహెచ్‌పీ గరిష్ట శక్తినీ, 110 ఎన్‌ఎం టార్క్‌ను ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు సిస్టమ్ 3.3 కేడబ్ల్యూ ఏసీ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ కారు బ్యాటరీని 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 7 గంటలు పడుతుంది. దీన్ని 10–80 శాతం నుంచి ఛార్జ్ చేయడానికి 5 గంటలు మాత్రమే పడుతుంది. ఈ కారును నెల రోజులు నడిపేందుకు అయ్యే ఖర్చు కేవలం రూ.500 మాత్రమే. ఇక కారు చిన్నగా ఉన్న ఇందులో 10.25 అంగుళాల స్క్రీన్ సెటప్, మాన్యువల్ ఈ కారు చిన్నదే అయినా ఇందులో 10.25–అంగుళాల స్క్రీన్ సెటప్, మాన్యువల్ ఏసీ స్టీరింగ్–మౌంటెడ్ కంట్రోల్స్, నావిగేషన్ కోసం కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. భద్రత కోసం కారులు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.