Kethireddy Venkatarami Reddy: ప్రత్యర్థుల స్వరం మార్చిన పవన్ గెలుపు.. గుడి కట్టాలంటున్న వైసీపీ నేతలు

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం. విపరీతమైన స్టార్ డం ఆ కుటుంబం సొంతం. లక్షలాదిమంది అభిమాన గణం ఉన్నా.. రాజకీయంగా రాణించలేకపోయామన్న లోటు ఆ కుటుంబానికి వెంటాడుతూ వస్తోంది. ప్రజారాజ్యం పార్టీ గుణపాఠాలు కళ్ళ ముందు కదులుతున్నాయి. జనసేనకు 10 సంవత్సరాలుగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి.

Written By: Dharma, Updated On : July 9, 2024 12:27 pm

Kethireddy Venkatarami Reddy

Follow us on

Kethireddy Venkatarami Reddy: అమరావతి : ఒక్క గెలుపు అభిమానులకు ఊపిరి పోసింది.ఒక్క గెలుపు ఒక కుటుంబానికి స్వాంతననిచ్చింది. ఒక్క గెలుపు ప్రత్యర్థుల్లో అభిప్రాయాన్ని మార్చింది.ఒక్క గెలుపు ఓటమి దెబ్బను రుచి చూపించింది.ఒక్క గెలుపు రాజకీయ ప్రత్యర్థులను ఎలా గౌరవించాలో నేర్పింది. ఆ ఒక్క గెలుపు ఎవరిదో తెలుసా పవన్ కళ్యాణ్ ది. అంతకుమించి జనసేనది. ఆ పార్టీ ఆవిర్భవించి పదేళ్ల అవుతున్నా.. సరైన విజయం దక్కలేదు. అందుకే ప్రత్యర్థుల అవమానాలకు, చీత్కారాలకు, తూలనాడే మాటలకు బాధితుడిగా మిగిలారు పవన్. అంతకుమించి బాధలు పడ్డారు జనసైనికులు. సాలిడ్ విజయంతో వీటన్నింటికీ చెక్ చెప్పడమే కాదు.. ప్రత్యర్థులకు సైతం సరికొత్త మెసేజ్ ఇవ్వగలిగారు పవన్.

*మెగా కుటుంబానికి పండగే..
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం. విపరీతమైన స్టార్ డం ఆ కుటుంబం సొంతం. లక్షలాదిమంది అభిమాన గణం ఉన్నా.. రాజకీయంగా రాణించలేకపోయామన్న లోటు ఆ కుటుంబానికి వెంటాడుతూ వస్తోంది. ప్రజారాజ్యం పార్టీ గుణపాఠాలు కళ్ళ ముందు కదులుతున్నాయి. జనసేనకు 10 సంవత్సరాలుగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ అవన్నీ పటాపంచలు అయ్యాయి. సంపూర్ణ విజయం దక్కించుకుంది జనసేన పార్టీ. కూటమి విజయంలో పవన్ కీలక పాత్ర పోషించారు. మెగా కుటుంబం ఆకాంక్ష ఎట్టకేలకు తీరింది. పొలిటికల్ కెరీర్ విషయంలో ఇన్ని రోజులు ఎదురైన అపవాదు తొలగిపోయింది.
* ఆ విమర్శలకు చెక్..
గత పదేళ్లుగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. నోరు తెరిస్తే ప్యాకేజీ, దత్త పుత్రుడు, మూడు పెళ్లిళ్లు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నారు పవన్. అసలు పవన్ ను నాయకుడంటే ఒప్పుకునే స్థితిలో వైసీపీ నేతలు ఉండేవారు కాదు. పవన్ పేరు ఎత్తితే చాలు విరుచుకు పడిపోయేవారు. జగన్ సహా వైసిపి నేతలంతా వ్యక్తిగత విమర్శలు చేసేవారు. కానీ తాజాగా జనసేన సృష్టించిన ప్రభంజనంతో వారి నోటి మాట రావడం లేదు. పైగా స్వరం కూడా మార్చేశారు. ఇన్ని రోజులు పవన్ ను పేరు పెట్టకుండా దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని పిలిచే జగన్ సైతం పవన్ కళ్యాణ్ అంటూ పేరు పెట్టి సంబోధిస్తున్నారు. వైసీపీ నేతలు అయితే గౌరవభావంతో మాట్లాడుతున్నారు. అనవసరంగా పవన్ ను కెలికి తప్పు చేశామని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అయితే పవన్ చరిష్మను కొత్తగా కొనియాడడం ప్రారంభించారు. పవన్ వల్లే టీడీపీ నేతలు గెలిచారని.. కూటమి అధికారంలోకి వచ్చిందని.. పవన్ విగ్రహం కట్టి టిడిపి నేతలు పూజించిన తప్పు లేదని వ్యాఖ్యానించారు. గతంలో ఇదే భరత్ పవన్ ను నాయకుడిగా కూడా ఒప్పుకునేవారు కాదు. ఇలా అందరూ పశ్చాత్తాపం పడేలా.. విజయాన్ని సొంతం చేసుకున్న పవన్.. నిజంగా గ్రేట్.