Maruti WagonR : భారతీయ వినియోగదారుల్లో సీఎన్జీ కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2025లో జరిగిన అమ్మకాలను చూస్తే, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి వాగన్ఆర్ అత్యధికంగా అమ్ముడైన CNG కారుగా నిలిచింది. ఈ కాలంలో మారుతి సుజుకి వాగన్ఆర్ CNG ని ఏకంగా 1,02,128 మంది కొనుగోలు చేశారు. ఈ విధంగా మారుతి వాగన్ఆర్ తన సొంత కంపెనీకి చెందిన ఎర్టిగా తర్వాత, రెండో స్థానంలో అత్యధికంగా అమ్ముడైన CNG కారుగా నిలిచింది. ఈ కారు ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
మారుతి వాగన్ఆర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.79 లక్షల నుండి టాప్ మోడల్‌లో రూ.7.62 లక్షల వరకు ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్ తో పాటు 14 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ కారులో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి ఫీచర్లు కూడా అందించారు.
Also Read: మహేష్ బాబు ను పక్కన పెట్టిన ఆ స్టార్ డైరెక్టర్…కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు…
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. మారుతి సుజుకి వాగన్ఆర్‌లో కస్టమర్లకు రెండు ఇంజిన్ ఆప్షన్లు లభిస్తాయి. అందులో మొదటిది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 67bhp పవర్‌ను, 89Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 90bhp పవర్‌ను, 113Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. వాగన్ఆర్‌లో CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 34 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, మారుతి బ్రాండ్ మీద ఉన్న నమ్మకంతో వాగన్ఆర్ మార్కెట్‌లో స్ట్రాంగ్ పొజిషన్ సంపాదించుకుంది.