https://oktelugu.com/

Maruti Suzuki Wagon R: కార్‌ అంటే ఇదే భయ్యా.. సేల్స్‌లో మూడేళ్లుగా నంబర్‌ వన్‌.. మైలేజీ , ఫీచర్స్‌ అదుర్స్‌

మారుతీ మోస్ట్‌ పవర్‌ఫుల కారుపై రూ.68 వేల తగ్గింపు, ధర, మైలేజీ, ఫీచర్లు చేస్తే వావ్‌ అనాల్సిందే. ఈ కార్ల జాబితాలో టాటాకు చెందిన రెండు కార్లు ఉన్నాయి. టాటా నెక్సాన్‌ 1,71.697 యూనిట్లు విక్రయించి నాలుగో స్థానంలో నిలిచింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 7, 2024 10:04 am
    Maruti Suzuki Wagon R

    Maruti Suzuki Wagon R

    Follow us on

    Maruti Suzuki Wagon R: మారుతి సుజుకి కార్లు భారతీయ కస్టమర్లలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. తాజా నివేదిక ప్రకారం మారుతి సుజుకి వ్యాగన్‌ ఆర్‌ వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలోనూ అమ్మకాలలో అగ్రస్థానం సాధించింది. మారుతి సుజుకీ వ్యాగన్‌ ఆర్‌ ఈ కాలంలో 2,00,177 యూనిట్ల కార్లను విక్రయించింది. మారుతి వ్యాగన్‌ ఆర్‌ ప్రారంభ ఎక్స్‌–షోరూమ్‌ ధర టాప్‌ మోడల్‌ కోసం రూ. 5.54 లక్షల నుంచి రూ. 8.50 లక్షల వరకు ఉంటుంది.

    కార్‌ కాదు అంతరకు మించి..
    ఇదే సమయంలో అదే సమయంలో మారుతి సుజుకి బాలెనో 1,95,660 యూనిట్ల విక్రయాలతో ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. అదే సమయంలో కార్ల వియ్రాల జాబితాలో మారుతి సుజుకీ స్విఫ్ట్‌ 1,95,321 యూనిట్లను ఈ ఏడాది వియ్రయించింది.

    కార్ల అమ్మకాలు ఇలా..
    2023–24 ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాల టాప్‌–10 జాబితాలో ఏయే కార్లు చోటు దక్కించుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

    = మారుతీ మోస్ట్‌ పవర్‌ఫుల కారుపై రూ.68 వేల తగ్గింపు, ధర, మైలేజీ, ఫీచర్లు చేస్తే వావ్‌ అనాల్సిందే. ఈ కార్ల జాబితాలో టాటాకు చెందిన రెండు కార్లు ఉన్నాయి. టాటా నెక్సాన్‌ 1,71.697 యూనిట్లు విక్రయించి నాలుగో స్థానంలో నిలిచింది.

    = ఇక ఈ జాబితాలో టాటా పంచ్‌ ఐదో స్థానంలో నిలిచింది. ఈ కాలంలో టాటా పంచ్‌ మొత్తం 1,70,076 కార్లను విక్రయించి టాటా పంచ్‌ ఐదో స్థానంలో నిలిచింది. గతేడాది టాటా పంచ్‌ మొత్తం 1,70,076 యూనిట్ల కార్లను సంస్థ విక్రయించింది.

    = ఇదే సమయంలో మారుతి అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ బ్రెజ్జా. ఇది ఆరో స్థానంలో ఉంది. మారుతి బ్రెజ్జా మొత్తం 1,69,897 యూనిట్ల కార్లను విక్రయించింది.

    = మారుతి సుజుకి అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్‌ డిజైర్‌ కార్ల విక్రయాల జాబితాలో ఏడో స్థానంలో ఉంది. గతేడాది మారుతీ డిజైర్‌ మొత్తం 1,64,517 యూనిట్ల కార్లను విక్రయించింది.

    = మారుతి సుజుకి వ్యాగన్‌ ఆర్‌– 200,177 యూనిట్లు, మారుతి సుజుకి బాలెనో– 195,607 యూనిట్లు. మారుతి సుజుకి స్విఫ్ట్‌– 195,321 యూనిట్లు, టాటా నెక్సాన్‌– 171,697 యూనిట్లు, టాటా పంచ్‌– 170,076 యూనిట్లు, 6. మారుతి సుజుకి బ్రెజ్జా– 169,897 యూనిట్లు, మారుతి సుజుకి డిజైర్‌– 164,517 యూనిట్లు, హ్యుందాయ్‌ క్రెటా– 161,653 యూనిట్లు, మారుతి సుజుకి ఎర్టిగా– 149,757 యూనిట్లు, మహీంద్రా స్కార్పియో– 141,462 యూనిట్లు అమ్ముడయ్యాయి.