Homeబిజినెస్Maruti Suzuki: ఈ కారుకు ఫుల్ డిమాండ్.. అయినా ధర తగ్గించారు.. ఎందుకంటే..

Maruti Suzuki: ఈ కారుకు ఫుల్ డిమాండ్.. అయినా ధర తగ్గించారు.. ఎందుకంటే..

Maruti Suzuki: ఆటోమోబైల్ రంగంలో సాధారణంగా ఒక మోడల్ కార్లు బాగా అమ్ముడవుతుంటే వాటి ధరలను పెంచడం కంపెనీలకు అలవాటు. కానీ, దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ Maruti Suzuki ఇందుకు భిన్నంగా సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. మార్కెట్లో తన కంపెనీకి చెందిన ఓ కారుకు విపరీతమైన డిమాండ్, అద్భుతమైన అమ్మకాలు ఉన్నప్పటికీ.. ఆ కారు ధర తగ్గించింది. మరి ఈ కారు ధర తగ్గడానికి కారణాలేంటో చూద్దాం..

మారుతి సుజుకి విక్టోరిస్ బెస్ట్ సెల్లింగ్:
మారుతి సుజుకీ కంపెనీకి చెందిన పాపులర్ ఎస్‌యూవీ మోడల్ మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కంపెనీ సొంతంగా తయారు చేసిన కార్లలో ‘విక్టోరిస్’ అత్యంత అధునాతనమైనది. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), పవర్డ్ టెయిల్‌గేట్, అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్ ఉన్నాయి. అలాగే ఇందులో 10.1 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ వంటి హై టెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారును రూ. 13. 26 లక్షలనుంచి రూ. 25.06 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ కారు జూన్ 2026లో 20వేల కంటే ఎక్కువ విక్రయాలు జరుపుకుంది. దీంతో 2025 ఏడాదితో పోలిస్తే19.3 శాతం వృద్ధి సాధించింది. దీంతో మార్కెట్లో విక్టోరిస్ కారు సెగ్మెంట్‌లో రెండో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా దూసుకుపోతోంది.

38,900 వరకు తగ్గింపు:
ఇటీవలి కాలంలో దాదాపు అన్ని ఆటోమోబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను పెంచుకుంటూ పోతుంటే, మారుతి సుజుకి మాత్రం విక్టోరిస్ కారు ధరను తగ్గించి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. సెలెక్ట్ చేసిన పెట్రోల్ వేరియంట్లపై గరిష్టంగా రూ. 38,900 వరకు ఎక్స్-షోరూమ్ ధరను తగ్గించింది. ముఖ్యంగా ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీలోని టాప్ ఎండ్ వేరియంట్లు అయిన జెడ్ఎక్స్ఐ , జెడ్ఎక్స్ఐ ప్లస్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లకు మాత్రమే ఈ ధరల తగ్గింపు వర్తిస్తుంది. బేస్ వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

మరికొన్ని కార్లకు భారీ బెనిఫిట్స్:
ధరల తగ్గింపు కేవలం కొన్ని పెట్రోల్ మోడళ్లకు మాత్రమే పరిమితం కాగా, మిగిలిన వేరియంట్లపై కంపెనీ భారీ బెనిఫిట్స్ అందిస్తోంది. విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లపై దాదాపు రూ. 90,000 వరకు ప్రయోజనాలను, సీఎన్‌జీ వెర్షన్లపై రూ. 80,000 వరకు తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను ఎంచుకునే వారికి ఈ ప్రీమియం కారు మరింత అందుబాటు ధరలోకి రానుంది.

ధర తగ్గించడంపై వ్యూహం
మార్కెట్లో విక్టోరిస్ కారు సెగ్మెంట్‌లో రెండో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా దూసుకుపోతోంది. అయినప్పటికీ ధరలు తగ్గించడం వెనుక ఒక వ్యూహం దాగి ఉంది. సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉండే స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్ని తగ్గించి, కస్టమర్లను మరింత ప్రీమియం వేరియంట్ల వైపు ఆకర్షించేందుకే మారుతి సుజుకి ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతం ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ విపరీతంగా పెరగడంతో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఈ తగ్గింపు సహాయపడుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular