Maruti Suzuki Swift: కారు ప్రతీ ఒక్కరికీ కంపెన్సరీ నీడ్ గా మారిపోయింది. చిన్న కుటుంబం బయటకు వెళ్లాలంటే రెండు బైకులను తప్పనిసరిగా వాడాల్సిందే. రెండింటినీ మేయింటెన్ చేయడం కంటే ఒక్క కారును మెయింటెన్ చేయడం మేలని నేడు మధ్య తరగతి భావిస్తోంది. అందుకే కార్ల వినియోగం పెరుగుతూ వస్తోంది. అయితే మధ్య తరగతికి అత్యంత అందుబాటులో వాహనాలను తెచ్చే కంపెనీల్లో మారుతీ సుజుకీ ఒకటి. ఇది చాలా కార్లను మధ్య తరగతి వారి కోసం తయారు చేస్తుంది. ఇందులో చాలా మోడళ్లు ఉన్నాయి. ఎక్కువగా అమ్ముడుపోయే వాటిలో మధ్య తరగతి వారు వినియోగించేవి కూడా ఉండడం విశేషం. మారుతీ సుజుకి స్విఫ్ట్ భారతీయ వినియోగదారులకు ఫేవరెట్ కార్ల జాబితాలో చేరిపోయింది. స్విఫ్ట్ వచ్చి చాలా సంవత్సరాలే అయినా మే 2024లో అప్డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ కారు అమ్మకాల్లో జోరు కొనసాగిస్తోంది. స్విఫ్ట్ కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. కంపెనీ మే, 2024లో అప్డేటెడ్ వెర్షన్‌ను తెచ్చింది. దీనికి వినియోగదారుల నుంచి మంచి స్పందనే వచ్చింది. 2024 జూన్ నుంచి నవంబర్ మధ్యలో అంటే కేవలం 6 నెలల్లోనే 94,000 యూనిట్లను అమ్మింది. సొంత చేసుకున్న ప్రతీ కస్టమర్ ఆనందంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
ఏ నెల ఎంత మంది కొన్నారంటే?
స్విఫ్ట్ అప్ డేటెడ్ వెర్షన్ రిలీజైన జూన్ లో 16,422 యూనిట్లను విక్రయించింది కంపెనీ. జూలైలో 16,854, ఆగస్టులో 12,844 యూనిట్లు, సెప్టెంబర్‌లో 16,241 కస్టమర్లు ఈ కొత్త మోడల్ ను కొనుగోలు చేశారు. అక్టోబర్‌లో 17,539 మంది కొనుగోలు చేశారు. నవంబర్‌లో మొత్తం 14,737 మంది కస్టమర్లను ఆకట్టుకుంది. ఆరు నెలల్లో 94,637 మంది కస్టమర్లు వచ్చారు.
అప్ డేటెడ్ కారు పవర్ట్రెయిన్ పరిశీలిస్తే.. 1.2-లీటర్ 3-సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. గరిష్టంగా 82 బీహెచ్‌పీ శక్తిని, 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంటుంది. పెట్రోల్ మ్యానువల్ వేరియంట్ లీటరుకు 24.8 కిలో మీటర్ల మైలేజ్, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ 25.75 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది.
అప్ డేటెడ్ మారుతీ స్విఫ్ట్ కేబిన్ లో వినియోగదారులు 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆటో మేటిక్ ఏసీ, వైర్‌లెస్ చార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా వంటి ఫీచర్లను అమర్చారు. అప్ డేటెడ్ స్విఫ్ట్ ప్రారంభ ధర రూ . 6.49 లక్షలు, టాప్-స్పెక్ మోడల్ రూ. 9.69 లక్షల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.