Prabhas
Prabhas : చేసింది ముందు చిత్రాలే అయినా ఇండియా వైడ్ పాపులారిటీ రాబట్టిన దర్శకుడు సందీప్ర్ రెడ్డి వంగ. ఇంటెన్స్ తో కూడిన ఆయన కథలు, పాత్రలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. మితిమీరిన వైలెన్స్, మహిళలపై తెరకెక్కిన కొన్ని సన్నివేశాలు అదే సమయంలో విమర్శలపాలయ్యాయి. స్టోరీ టెల్లింగ్ లో తనదైన శైలి క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగ ట్రెండ్ సెట్టర్ అనడంలో సందేహం లేదు. ఇక సందీప్ రెడ్డి హీరోలను చూపించే తీరు ప్రత్యేకం. ఆయన హీరోలు చాలా వైలెంట్ గా ఉంటారు.
అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ అసాధారణం అని చెప్పొచ్చు. అలాంటి దర్శకుడితో ప్రభాస్ వంటి మాస్ హీరో మూవీ అనగానే అంచనాలు పీక్స్ కి చేరాయి. సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ టైటిల్ తో ప్రభాస్ మూవీ ప్రకటించి చాలా కాలం అవుతుంది. ఇక ప్రభాస్ ని మరింత వైలెంట్ గా ప్రజెంట్ చేస్తానని సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే చెప్పాడు. అయితే స్పిరిట్ అంతకంతకు వెనక్కి పోతుంది. స్పిరిట్ కంటే వెనుక ప్రకటించిన ప్రభాస్ చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లాయి.
Also Read : ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ వల్ల కెరియర్ పోగొట్టుకున్న స్టార్ హీరో…
సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీ సీక్వెల్ యానిమల్ పార్క్ చేయాల్సి ఉంది. యానిమల్ పార్క్ పూర్తి చేశాకే స్పిరిట్ అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ వార్త ప్రభాస్ ఫ్యాన్స్ ని ఒకింత నిరాశకు గురి చేసింది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పుకార్లలో నిజం లేదని నిర్మాత భూషణ్ కుమార్ తెలియజేశారు. యానిమల్ నిర్మాతగా ఉన్న భూషణ్ కుమార్, స్పిరిట్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆయన మాట్లాడుతూ… స్పిరిట్ మరో రెండు మూడు నెలల్లో సెట్స్ పైకి వెళుతుంది. 2027లో విడుదల చేస్తాము. స్పిరిట్ కంటే ముందు యానిమల్ పార్క్ తెరకెక్కిస్తున్నామన్న వార్తల్లో నిజం లేదు, అన్నారు.
భూషణ్ కుమార్ ప్రకటన ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్, హను రాఘవపూడి చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. రాజాసాబ్ విడుదల కావాల్సి ఉంది. హను రాఘవపూడి మూవీ వరల్డ్ వార్ 2 నేపథ్యంలో తెరకెక్కుతుంది.
Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?
Web Title: Prabhas spirit release date update