Maruti Suzuki alto K10: మార్కెట్లోకి Maruti Suzuki కార్లు వస్తున్నాయంటే కొందరికి పండుగ వాతావరణం అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈ కంపెనీకి చెందిన కార్లు మధ్య తరగతి ప్రజలకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం కార్లతో పోటీపడి ఫీచర్లను కలిగి ఉంటాయి. అయితే మారుతి సుజుకి గతంలో రిలీజ్ చేసిన కొన్ని కార్లను అప్డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మారుస్తుంది. ఇందులో భాగంగా దశాబ్దాల కిందట వచ్చిన ఆల్టో K 10 కారులో ఇప్పటి వారి కి అనుగుణంగా మార్చి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది పాత కారు అయినప్పటికీ ఇందులో డిజైన్, ఇంజన్ పనితీరుతో పాటు ఫీచర్స్ ను లేటెస్ట్ టెక్నాలజీతో సెట్ చేశారు. దీంతో ఈ కారును కొనాలని చాలామంది అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ కారు ధర తక్కువగా ఉండడంతో ఎలాంటి అప్పులు చేయకుండా కొనుగోలు చేయచ్చని కొందరు చెబుతూ ఉంటారు. అయితే గతంలో తక్కువ ధరలో వచ్చిన ఈ మోడల్ ఇప్పుడు ఏ ధరలో అందుబాటులో ఉందో చూద్దాం..
2026 కొత్త సంవత్సరం సందర్భంగా Maruti Suzuki auto K10 లేటెస్ట్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. దీని ముందటి భాగం పూర్తిగా మార్చేశారు. గతంలో కంటే ఇప్పుడు ఉన్న కొత్త కారులో గ్రిల్ ఆకసినియంగా మార్చారు. అలాగే LED హెడ్ లాంప్ తో సౌకర్యవంతంగా ఉండరు ఉంది. రిఫ్రిస్ట్ చేసిన బాడీ లైన్స్, కాంట్రాక్టు నిష్పత్తులు రద్దీగా ఉండే రోడ్లపై సులభంగా వెళ్లే విధంగా మార్చేశారు. బ్యాక్ సైడ్ టెయిల్ లాంప్స్ సైతం ఆకర్షినియంగా ఉండి.. బంపర్ బోల్డ్ ఆకాశంలో పెంచుతున్నాయి.
ఈ కొత్త కారు లోపల డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా మార్చారు. కొత్తగా కారు నడిపే వారికి ఇది చాలా అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో నేటి తరం వారికి అనుగుణంగా సీటింగ్ సౌకర్యాన్ని మార్చారు. ఇందులో కూర్చొని దూర ప్రయాణం చేసినా కూడా ఎలాంటి అలసట ఉండకుండా చేస్తుంది. లెగ్ రూమ్ పెంచి మరింత సౌకర్యవంతంగా ఉండేలా చేశారు. ఇందులో ఉండే ఫీచర్లు ఇప్పటి తరానికి బాగా నచ్చుతాయి. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టచ్ స్క్రీన్ ఇన్ఫో టైం మేడ్ సిస్టం, స్టీరింగ్ ఆడియో, నావిగేషన్ ఫంక్షన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటివి డ్రైవర్లకు అనుకూలంగా ఉంటాయి. అలాగే పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే ప్రీమియం కార్ల వలె అనిపిస్తుంది.
సాధారణంగా మారుతి కార్లలో ఇంజన్ పనితీరు మెరుగ్గా ఉంటుందని చాలామంది భావన. అలాగే ఈ కొత్త ఆల్టో k 10 కారులో 1.0 పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఇది నగరాల్లో ప్రయాణం చేసే వారితో పాటు దూర ప్రయాణాలు చేసే వారికి కూడా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. లీటర్ ఇంధనానికి 45 కిలోమీటర్ల మైలేజ్ వరకు అందిస్తుంది. అలాగే ఇందులో సస్పెన్షన్ సెటప్ ఉండడంతో చిన్నచిన్న గుంతల ప్రదేశంలో సైతం సులభంగా వెళుతుంది. అంతేకాకుండా ఇరుకైన ప్రదేశాల్లో కూడా పార్కింగ్ చేసుకోవడానికి సులభతరంగా స్టీరింగ్ ను తేలికగా ఉండే విధంగా సెట్ చేశారు. ఇక ఇందులో సేఫ్టీ ఫీచర్లకు కొదవలేదు అని చెప్పవచ్చు. నమ్మకమైన బ్రేకింగ్ సిస్టంతో రోజువారి ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే రూ.3.70 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.5.45 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.