Maruti Suzuki Alto 800: భారతీయ కార్ల వినియోగదారులకు Maruti Suzuki అనుకూలంగా ఉండే కార్లను అందిస్తూ వస్తోంది. చిన్న ఫ్యామిలీ నుంచి ఉమ్మడి కుటుంబం ఒకేసారి ప్రయాణించేలా అన్ని రకాల కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఆల్టో 800 కారు ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దశాబ్దాలుగా కొత్తగా కారు కొనాలని అనుకునేవారు.. చిన్న ఫ్యామిలీ ఈ కారును ఎక్కువగా ఎంపిక చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇది నేటి తరానికి అనుగుణంగా అనేక మార్పులను చేసుకొని మార్కెట్లోకి వచ్చింది. ఈ కొత్త కారులో ఎలాంటి ఫీచర్స్, ఇంజన్ పనితీరు ఎలా ఇప్పుడు చూద్దాం.
మారుతి సుజుకి కంపెనీ 2026 కొత్త సంవత్సరం సందర్భంగా Alto 800 కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త కారులో LED DRL ప్రొజెక్టర్ ల్యాంప్ తో ఉన్నాయి. అలాగే బోల్డ్ గ్రిల్ అందరినీ ఆకర్షిస్తుంది. సాయంత్రం సమయంలో కూడా సులభంగా ప్రయాణం చేసేలా ఈ హెడ్ లాంప్స్ అనుగుణంగా ఉంటాయి. ఆకర్షించే బంపర్లు, టాప్ ట్రిమ్ లపై 14 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఎదుటివారిని టెంప్ట్ చేస్తాయి. డ్యూయల్ టోన్ పెయింట్ తో ఈ కారు ఆదర్శనీయంగా కనిపిస్తుంది.
ఈ కారు ఇన్నర్ లో కూడా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన సౌకర్యవంతమైన ఫీచర్లో ఉన్నాయి. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు క్లైమేట్ కంట్రోల్, యాంబీ అంటే ఎల్ఈడి ట్రిప్ ఉండనుంది. వైర్లెస్ ఆటో, ఆపిల్ కార్ ప్లే బీమింగ్ మ్యాప్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే లెథరేట్ సీట్స్, బ్యాక్ సైడ్ ఏసీ వేరియంట్ ఉండడంతో నలుగురు ప్రయాణికులు సురక్షితంగా ఉండవచ్చు. అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, వైర్లెస్ ఛార్జింగ్ వంటివి అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. ప్రశాంతమైన వాతావరణానికి పవర్ విండోస్ కూడా హాయిగా ఉంటుంది.
ఈ కారులో అప్డేట్ చేసిన మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 49 పిఎస్ పవర్ తో పాటు 69 ఎన్ ఎం టార్గను రిలీజ్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పని చేస్తుంది. లీడర్ ఇంధనానికి 32 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఇది CNG వేరియంట్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో 40 కిలోమీటర్ వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇందులో రక్షణ కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, EBD తో కూడిన ABS ఓల్డ్ టెక్నాలజీ ఉండనుంది. బ్యాక్ సైడ్ పార్కింగ్ సెన్సార్ రక్షణగా ఉంటాయి. అయితే కొత్తగా ఇందులో కొన్ని ఫీచర్లు చేర్చినా కూడా దీనిని రూ. 4 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. కొత్తగా కారు కొనే వారితోపాటు చిన్న ఫ్యామిలీ కారు కొనాలనుకుంటే ఇది అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.