https://oktelugu.com/

కొత్త కార్లను విడుదల చేసిన మారుతి.. ఈ మూడు ఒకే ధరతో విక్రయం..

మారుతి నుంచి రిలీజ్ అయినా ఆల్టో కె 10 ఇప్పటికే హ్యాచ్ బ్యాక్ వేరింట్ లో బెస్ట్ కారుగా నిలిచింది. ఇప్పుడు దీనిని డ్రీమ్ సిరీస్ లో భాగంగా కొత్తగా రిలీజ్ చేశారు. కొత్త కారు ధరను రూ.5.35 లక్షల తో విక్రయించనున్నారు. ఈ కారులో రివర్స్ పార్కింగ్ కెమెరా, సెక్యూరిటీ సిస్టమ్ తో పాటు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : June 7, 2024 / 03:06 PM IST

    Alto K 10 Milage Car 1

    Follow us on

    ఆటోమోబైల్ రంగంలో మారుతి సుజుకీ సంచలనాలను సృష్టిస్తుంది. వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కొత్త కార్లను అందుబాటులోకి తీసుకొస్తేంది. ఉన్న కార్లపై డిస్కౌంట్లు ప్రకటిస్తూ అలరిస్తోంది. తాజాగా మూడు కార్లను డ్రీమ్ సిరీస్ లో భాగంగా ప్రత్యేక ఎడిషన్లు రిలీజ్ చేసింది. మిగతా కార్ల కంటే డ్రీమ్ సిరీస్ లో ఉండే కార్లు బెస్ట్ సెక్యూరిటీని ఇస్తాయి. అధునాతన ఫీచర్లతో అలరిస్తాయి. ఇదిలా ఉండగా ఈ మూడు కార్లు ఒకే ధరలో ఉండడం విశేషం. అయితే ఇవి తక్కువ సంఖ్యలోనే విక్రయించబడుతాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ మూడు కార్ల వివరాలు..
    మారుతి నుంచి రిలీజ్ అయినా ఆల్టో కె 10 ఇప్పటికే హ్యాచ్ బ్యాక్ వేరింట్ లో బెస్ట్ కారుగా నిలిచింది. ఇప్పుడు దీనిని డ్రీమ్ సిరీస్ లో భాగంగా కొత్తగా రిలీజ్ చేశారు. కొత్త కారు ధరను రూ.5.35 లక్షల తో విక్రయించనున్నారు. ఈ కారులో రివర్స్ పార్కింగ్ కెమెరా, సెక్యూరిటీ సిస్టమ్ తో పాటు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే యాక్ససరీస్ లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నారు.
    మారుతి కి చెందిన మరో కారు ఎస్ ప్రెస్సో డ్రీమ్ సిరీస్ లో రిలీజ్ అయంది. S ప్రెస్సో VXi వేరియంట్ ఆధారంగా రూపొందించిన ఈ కారులో మ్యాట్ బ్లాక్ క్లాడింగ్, సైడ్ లో స్కిడ్ ప్లేట్లు, సిల్వర్ బాడీ సైడ్ మోల్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.  ఇందులోనూ రివర్స్ పార్కింగ్ కెమెరా, సెక్యూరిటీ సిస్టమ్ అలరిస్తోంది. వీటితో పాటు ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ కూడా ఉన్నాయి.
    మరో కారు సెలెరియో డ్రీమ్ సిరీస్ తో రిలీజ్ చేశారు. ఇది హ్యాచ్ బ్యాక్ లలో బెస్ట్ కారుగా నిలిచింది. దీనిని LXi వేరియంట్ లో రూపొందించారు.  ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే రివర్స్ పార్కింగ్ కెమెరా, స్పీకర్లు అలరిస్తాయి. దీనిని రూ.4.99 లక్షల తో విక్రయించనున్నారు. అయితే ఎంట్రీ లెవల్లో కార్ల విక్రయాలను పెంచడానికిే మారుతి అదనపు టెక్నికల్ ఫీచర్లను జోడించింది. అలాగే ఆటో గేర్ షిప్ట్ కార్ల ధరలను సైతం తగ్గించింది.