KYC Update: బ్యాంకులో ఖాతా ఉన్నా.. మ్యూచువల్‌ఫణండ్‌లో మదుపు చేస్తున్నా… ఇతర ఆర్థిక కార్యకలాపాలు సజావుగా జరగాలన్నా.. కేవైసీ(మీ ఖాతాదారు గురించి తెలుసరోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. కస్టమర్ల ఖాతాకు భద్రతను పెంచడంతోపాటు మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు ఇలా కేవైసీ వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం అనేక బ్యాంకులు తమ కస్టమర్లకు కేవైసీ వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే సదుపనాయం కల్పించాయి. బ్యాంక్ పోర్టల్‌లోకి వెళ్లి సులువుగా కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు. బ్యాంకును బట్టి ఈ ప్రక్రియలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ప్రధాన బ్యాంకుల్లో ఈ ప్రక్రియ ఇలా ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో పోర్టల్‌లోకి లాగిన్ అయి “My Accounts & Profile” సెక్షన్ కింద కనిపించే Update KYC పై క్లిక్ చయేయాలి. ఎస్‌బీఐ అకౌంట్ ఎంచుకుని Next పై క్లిక్ చేసి సంబంధిత పత్రాలు అప్‌లోడ్ చేయాలి.
హె చ్‌డీఎప్‌సీ.. హెచ్‌డీఎఫ్‌సీలో రీ కేవైసీని వెబ్‌సైట్‌లో సులువుగా చేసుకోవచ్చు. పోర్టల్‌లోని వ్యక్తిగత విభాగంలో దీనికి సంబందించిన లింక్ ఉంటుంది. లేదంటే బ్యాంకు నుంచి సంబంధిత ఫాం డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నింపి పత్రాలు జతచేసి సమీపంలోని శాఖకు పంపించాలి. లేదంటే నేరుగా బ్యాంకులో అందించొచ్చు.
ఐసీఐసీఐ..
ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాల.ఇ ఒకవేళ మీ కేవైసీ అప్‌డేట్ చేయాల్సి ఉంటే స్క్రీన్‌పై చూపిస్తుంది. అక్కడే కనిపించే ఆథరైజేషన్ బాక్స్ టిక్ Update Through Document Upload ఆప్షన్ ఎంచుకోవాలి. వివరాల్లో మార్పులు ఉంటే వాటిని అప్‌డేట్ చేసి పాన్ కార్డు అప్‌లోడ్ చేయాలి. చిరునామా వివరాలు కూడా మార్చుకోవచ్చు.
కెనరాబ్యాంకు..
లాగిన్ వివరాలతో కెనరా బ్యాంకు వెబ్‌సైట్‌లో లాగిన్ అవగానే Services కింద కనిపించే Re KYC పై క్లిక్ చేసి వివరాలు అప్‌డేట్ చేయాలి.
యెస్ బ్యాంకు..
బ్యాంకు పోర్టల్‌లో లాగిన్ అవగానే రీ కేవైసీని పాప్ అప్ ఉంటుంది. ఆధార్ అథెంటికేషన్‌లో కేవైసీ పూర్తి చేయాలి. చిరునామాల్లో ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు.పాస్‌పోర్టు, పాన్‌కార్డు, భారత ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆధార్ లెటర్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఉపాధి హామీ జాబ్‌కార్డులను చిరునామా ప్రూఫ్‌గా అంగీకరిస్తారు.