Maruti : ప్రముఖ వాహన తయారీదారు సుజుకి సంస్థ తమ ఈ-ఎవ్రీ (e-Every) కమర్షియల్ ఎలక్ట్రిక్ కేఈ వ్యాన్‌ను మొదటిసారిగా 2023లో జరిగిన జీ7 హిరోషిమా శిఖరాగ్ర సమావేశంలో ప్రదర్శించింది. అదే ఏడాది దీనిని విడుదల చేయాలని కూడా భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. సుజుకి అధికారికంగా 2025లో ఈ-ఎవ్రీ ఎలక్ట్రిక్ కమర్షియల్ వ్యాన్‌ను విడుదల చేయనున్నట్లు కన్ఫాం చేసింది. సుజుకి ప్రస్తుతం తన దేశీయ మార్కెట్‌లో.. పాకిస్తాన్ వంటి కొన్ని విదేశీ మార్కెట్లలో పెట్రోల్‌తో నడిచే ఎవ్రీ కమర్షియల్ వ్యాన్‌ను విక్రయిస్తోంది. ఇది ఇండియాలో మారుతి ఓమ్నీని కూడా తయారుచేసిన సుజుకి క్యారీ ఫ్యామిలీకి చెందినది.
Also Read : మరో మూడ్రోజులే.. హ్యుందాయ్ కార్ల మీద రూ.1.38లక్షలు ఆదా చేసుకోవచ్చు
అయితే, ఈ రెండు వ్యాన్‌లు చాలా భిన్నంగా ఉంటాయి. రీబ్యాడ్జ్డ్ వెర్షన్లు ఏ మాత్రం కావు. ఈ-ఎవ్రీ ఎలక్ట్రిక్ కేఈ కమర్షియల్ వ్యాన్ విషయానికి వస్తే.. దీని విజువల్ ప్రొఫైల్ చాలా వరకు ICE (Internal Combustion Engine) వెర్షన్‌ను పోలి ఉంటుంది. ఫ్రంట్ బంపర్‌పై అమర్చిన ఛార్జింగ్ పోర్ట్ వంటి కొన్నిఈవీ-ప్రత్యేక మార్పులు మాత్రమే ఇందులో కనిపిస్తాయి. సుజుకి ఈ-ఎవ్రీ ఎలక్ట్రిక్ కమర్షియల్ వ్యాన్‌లో పెద్ద విండ్‌స్క్రీన్, ఫ్లాట్ ఫ్రంట్ ఫేసియా, ట్రెపెజాయిడల్ హెడ్‌ల్యాంప్స్,వర్టికల్, హారిజాంటల్ స్లాట్‌లతో కూడిన ప్రముఖ గ్రిల్‌తో ఒక బాక్సీ ప్రొఫైల్ ఉంది. వ్యాన్ రెండవ వరుసలో స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. కొలతల పరంగా ఈ-ఎవ్రీ ఎలక్ట్రిక్ కమర్షియల్ వ్యాన్ ICE వెర్షన్‌కు ఈక్వల్ గా ఉంటుంది. దీనితో పాటు పెద్ద బూట్ స్పేస్ కూడా లభిస్తుంది.
ఎలక్ట్రిక్ ఈ-ఎవ్రీ వ్యాన్ దాని ICE టెక్నాలజీతో పోలిస్తే మెరుగైన ఇంటీరియర్‌తో వస్తుంది. ఇందులో ఎక్కువ స్పేస్, కొన్ని ప్రీమియం ఫీచర్స్ కూడా ఉంటాయి. రాబోయే వారాల్లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రిలీజయ్యే అవకాశం ఉంది. అధికారికంగా స్పెసిఫికేషన్లు ఏంటనేది వెల్లడించనప్పటికీ.. సుజుకి ఈ-ఎవ్రీ ఎలక్ట్రిక్ వ్యాన్ దాదాపు 200 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని తెలుస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ దాదాపు 64 PS పవర్ ని ఉత్పత్తి చేయగలదు. ఇది పెట్రోల్‌తో నడిచే సుజుకి ఎవ్రీలో అందుబాటులో ఉన్న 660సీసీ టర్బో యూనిట్‌తో సమానంగా ఉంటుంది. 660సీసీ NA పెట్రోల్ యూనిట్ 49 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.
సుజుకి ఎవ్రీ ఫ్యామిలీకి చెందిన ఇతర మోడళ్లు, టయోటా పిక్సీస్, డైహత్సు హిజెట్ పేరుతో విక్రయిస్తున్నాయి. వీటికి కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లు రాబోతున్నాయి. సుజుకి ఎవ్రీ, టయోటా పిక్సీస్, డైహత్సు హిజెట్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లు డైహత్సు న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (DNGA) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ మూడు ప్రాథమికంగా ఒకేలా కనిపిస్తాయి. బ్రాండింగ్ అంశాలలో మాత్రమే తేడా ఉంటుంది. డైహత్సు డెవలప్ చేసిన ICE వెర్షన్ల మాదిరిగానే ఎలక్ట్రిక్ వ్యాన్లను కూడా డైహత్సు డెవలప్ చేస్తుంది.
Also Read : హీరో నుంచి మరో రెండు కొత్త బైక్స్..ఫీచర్స్ వింటే పిచ్చెక్కాల్సిందే