Single : శ్రీవిష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సింగిల్'(#Single Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆటలోనే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ లో అల్లు అరవింద్(Allu Aravind) శ్రీవిష్ణు కి మరో రెండు సినిమాలు చేసేందుకు చెక్కులు కూడా ఇచ్చేశాడట. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలను చేతివేళ్ళతో లెక్కపెట్టొచ్చు. వాటిల్లో సింగిల్ చిత్రం కూడా చేరిపోతుంది. కేవలం వీకెండ్ లోనే కాదు, వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకున్న ఈ చిత్రం రెండవ వీకెండ్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టి బయ్యర్స్ కి మరింత లాభాలను తెచ్చి పెట్టింది.
Also Read : ‘సింగిల్’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఏకంగా ‘హిట్ 3’ నే దాటేసిందిగా!
శనివారం రోజున అనగా 9 వ రోజున ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, పదవ రోజున 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా పది రోజులకు గాను ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 10 కోట్ల 96 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా వరల్డ్ వైడ్ గా 14 కోట్ల 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు 27 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ వరకు పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు కాబట్టి, ఈ చిత్రం కచ్చితంగా మరో పది కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ప్రాంతాల వారీగా ఈ సినిమాకు ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం లో 4 కోట్ల 77 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతం నుండి కోటి 25 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి 4 కోట్ల 94 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా 3 కోట్ల 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 14 కోట్ల 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 7 కోట్ల రూపాయిలు మాత్రమే. ఇప్పటి వరకు బయ్యర్స్ కి 7 కోట్ల 34 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. ఫుల్ రన్ పూర్తి అయ్యే సరికి మరో మూడు కోట్ల రూపాయిల లాభాలు రావొచ్చు. బాక్స్ ఆఫీస్ టర్మ్స్ ప్రకారం ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది.
Also Read : 5వ రోజు చరిత్ర సృష్టించిన శ్రీవిష్ణు ‘సింగల్’..ఎంత గ్రాస్ రాబట్టిందంటే!