Homeబిజినెస్Maruti : కొత్త కారు కొనాలనుకుంటున్నారా? 5 లక్షల్లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే

Maruti : కొత్త కారు కొనాలనుకుంటున్నారా? 5 లక్షల్లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే

Maruti : భారతదేశంలో సొంత కారు కొనుక్కోవడం చాలా మంది కల. తమకూ ఒక కారు ఉండాలని, అందులో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి తిరగాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. కానీ చాలాసార్లు బడ్జెట్ సరిపోకపోవడం వల్ల ఈ కల నెరవేరదు. ఎందుకంటే కార్ల ధరలు ప్రస్తుతం బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి కారు కొనాలంటే కనీసం 10 లక్షల రూపాయలు కావాలి. అయితే, ఇప్పటికీ భారతదేశంలో దాదాపు 5 లక్షల రూపాయల బడ్జెట్‌లో వచ్చే మూడు మంచి కార్లు ఉన్నాయి. ఈ కార్లలో బేసిక్ ఫీచర్లు అన్నీ ఉంటాయి. ఈ కార్లు మిమ్మల్ని ఎండ, వాన నుండి రక్షిస్తాయి. అంతేకాదు, వీటిలో మంచి మైలేజ్ కూడా లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

Also Read : ఆరు నెలల్లోనే 94 వేలకు పైగా అమ్మకాలు.. ధర కూడా అంతంతే.. ఈ ఫెవరెట్ కారు గురించి తెలుసుకుందామా?

1. మారుతి ఆల్టో కె10 (Maruti Alto K10):
ఆల్టో కె10 ఒక ఎంట్రీ-లెవెల్ కారు. ఇది ధర ప్రకారం మంచి స్పేస్, ఫిట్ అండ్ ఫినిష్, అవసరమైన ఫీచర్లను అందిస్తుంది. ఇది మంచి మైలేజ్ ఇస్తుంది, తగినంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. డ్రైవింగ్‌కు కూడా చాలా బాగుంటుంది. ఈ కారు బేస్ మోడల్ ధర ఆన్ రోడ్ రూ.4.73 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్‌తో ఈ కారు లీటరుకు 24.39కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

2. రెనో క్విడ్ (Renault Kwid):
ఫ్రెంచ్ కంపెనీ రెనో ఇండియాలో విక్రయించే అత్యంత చౌకైన కార్లలో ఇది ఒకటి. క్విడ్ ఆన్ రోడ్ ధర రూ.5.31 లక్షల నుంచి రూ.7.38 లక్షల వరకు ఉంటుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.45 లక్షల మధ్య ఉంటుంది. క్విడ్ CNGలో కూడా అందుబాటులో ఉంది. ఈ కారుకు మోడ్రన్ డిజైన్ ఉంది. ఐదుగురికి తగినంత స్పేస్ ఉంటుంది. ఈ కారు లీటరుకు 22 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

3. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso):
ఇది మారుతి హ్యాచ్‌బ్యాక్ కారు.. కానీ చూడటానికి చిన్న SUVలా ఉంటుంది. ఈ కారులో ఐదుగురికి తగినంత స్పేస్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఇది మట్టిరోడ్లపై కూడా సులభంగా వెళ్లగలదు. మారుతి ఎస్-ప్రెస్సో ధర రూ.4.26 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ ధర రూ.6.12 లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూమ్. ఇందులో నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా చాలా మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి.

Also Read : మారుతి స్విప్ట్.. సేప్టీ రేటింగ్ లో దీని ర్యాంక్ ఎంతంటే? ఇది నమ్మగలరా? అసలు విషయమేంటంటే?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version