Homeబిజినెస్Maruti Suzuki ALTO K10: కారు కొనాలని అనుకునే చిన్న ఫ్యామిలీకి ఇదే బెస్ట్ మోడల్..

Maruti Suzuki ALTO K10: కారు కొనాలని అనుకునే చిన్న ఫ్యామిలీకి ఇదే బెస్ట్ మోడల్..

Maruti Suzuki ALTO K10: చిన్న ఫ్యామిలీ సైతం ఇప్పుడు సొంతంగా కారు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే బడ్జెట్లోనే కారును కొనాలని చూస్తున్నా వారికి కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. ఇలాంటి వారికి Maruti Suzuki కంపెనీ ది బెస్ట్ గా నిలుస్తోంది. ఇప్పటికే దీని నుంచి హ్యాచ్ బ్యాక్, SUV కార్లు బడ్జెట్లోనే మార్కెట్లోకి వచ్చాయి. అయితే మొదటిసారి కారు కొనాలని అనుకునే వారికి.. చిన్న ఫ్యామిలీకి అనుకూలంగా ఉంటూ.. బడ్జెట్లోనే వచ్చే కారు లేదంటే..Alto గురించే చెబుతారు. ఈ కారు దశాబ్దాల కిందటే మార్కెట్లోకి వచ్చింది. అయితే కాలం మారుతున్న కొద్ది దీనిని అప్డేట్ చేస్తూ వస్తున్నారు. గత ఏడాది మొదటి అర్థ భాగంలో ఈ కారు అమ్మకాలు తగ్గినప్పటికీ.. ఆ తర్వాత విక్రయాలు పుంజుకున్నాయి. ఇంతకీ ఈ కారు అమ్మకాలు పెరగడానికి కారణం ఏంటంటే?

Maruti Suzuki నుంచి మార్కెట్లోకి వచ్చిన ALTO K 10 కారు దశాబ్దాల కిందటి నుంచి ఎవర్గ్రీన్గా నిలుస్తోంది. ఈ కారు పోటీగా ఎన్నో మోడల్స్ వచ్చినప్పటికీ.. దీని ఆదరణ ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. అయితే 2025 సంవత్సరం మార్చి 31 నుంచి సెప్టెంబర్ వరకు ఈ కారు అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి. కానీ 2025
అక్టోబర్లో జీఎస్టీ సవరణలు చేయడం వల్ల ఈఎంఐ భారం తగ్గడంతో అమ్మకాలు పెరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో ఫెస్టివల్ సీజన్ కూడా ఉండడంతో అమ్మకాలు మరింతగా పుంజుకున్నాయి.

అయితే ఈ కారు అమ్మకాలు పెరగడానికి దీని ధర తక్కువగా ఉండడం మాత్రమే కాకుండా ఇందులో ఉండే ఫీచర్స్ కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్కు అనుగుణంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆల్టో కే 10 కారును మార్కెట్లో రూ.3.70 లక్షలతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.5.45 లక్షల వరకు ఉంది. చిన్న ఫ్యామిలీ సొంతంగా కారు ఉండాలని అనుకునే వారికి ఈ బడ్జెట్ బాగా సరిపోతుంది.

ఈ కారులో 1.0 లీటర్ డ్యూయల్ సిరీస్ ఇంజన్ ను అమర్చారు. ఈ 5 స్పీడ్ మేన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. లీటర్ ఇంధనానికి 24.90 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అలాగే ఇందులో CNG ఆప్షన్ కూడా ఉంది. దీనిపై కిలో ఇంధనానికి 33.8 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. బడ్జెట్లో కారు కొనాలని అనుకునే వారితోపాటు ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అంతేకాకుండా ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ తో పాటు EBD తో కూడిన ABS ఉన్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version