https://oktelugu.com/

Maruthi WaganR: డాక్టర్లు, ఇంజనీర్లు ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.. ఎందుకంటే?

మారుతి కార్లు అంటే కొందరికీ యమ క్రేజీ. ఈ కంపెనీ నుంచి ఎన్నో మోడళ్లు వచ్చాయి..వస్తున్నాయి.. కానీ ఎవర్ గ్రీన్ మోడల్ ఏదంటే వ్యాగన్ ఆర్ అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా ఈ కారుకు ఉన్న క్రేజ్ తగ్గడం లేదు. మారుతి వ్యాగన్ ఆర్ మార్కెట్లోకి 1999లో విడుదలయింది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 6, 2024 10:56 am
    Maruthi Wagan R

    Maruthi Wagan R

    Follow us on

    Maruthi WaganR:  భారత్ లో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. నేటి కాలంలో బడా బాబులే కాకుండా సామాన్యులు సైతం ఇంట్లో నిత్యావసరంగా కారును ఉంచుకుంటున్నారు. అయితే ఓ కంపెనీకి చెందిన కారును డాక్టర్లు, ఇంజనీర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. మార్కెట్లోకి ఎన్నో కొత్త మోడళ్లు వచ్చినా.. ఈ కారుకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారట. ఈ కారు ఇచ్చే మైలేజ్, స్పేషియస్ తో పాటు లో బడ్జెట్ లో అందుబాటులో ఉండడంతో ఎగబడుతున్నారట. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

    మారుతి కార్లు అంటే కొందరికీ యమ క్రేజీ. ఈ కంపెనీ నుంచి ఎన్నో మోడళ్లు వచ్చాయి..వస్తున్నాయి.. కానీ ఎవర్ గ్రీన్ మోడల్ ఏదంటే వ్యాగన్ ఆర్ అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా ఈ కారుకు ఉన్న క్రేజ్ తగ్గడం లేదు. మారుతి వ్యాగన్ ఆర్ మార్కెట్లోకి 1999లో విడుదలయింది. ఆప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాగన్ ఆర్ తరువాత ఎన్నో మోడళ్లు వచ్చాయి. కానీ ఈ కారు కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ఉన్నత స్థాయి వ్యక్తులు సైతం ఈ కారునే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

    Wagan R In Hyderabad

    Wagan R In Hyderabad

    మారుతి వ్యాగన్ ఆర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్ కూడా ఉంది. ఇది 88.5 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హ్యాచ్ బ్యాక్ కారు అయిన ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు స్టీరింగ్ మౌంట్ ఆడియో కంట్రోల్ తో పాటు స్మార్ట్ ఫోన్ నావిగేషన్ అప్షన్లు ఉన్నాయి. సేప్టీ పరంగా డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

    మారుతి వ్యాగన్ ఆర్ లో ఎస్ యూవీ అయినప్పటికీ ఇన్నర్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలకు వెళ్లేవారికి సైతం ఇందులో ప్రయాణికులతో పాటు లగేజీని ఏర్పాటు చేసుకొని వెళ్లొచ్చు. అంతేకాకుండా రీసేల్ వెహికల్స్ లో వ్యాగన్ ఆర్ ముందు ఉంటోంది. దశాబ్దాలుగా ఈ మోడల్ నెలకు 15 వేల చొప్పున విక్రయాలు జరుపుకుంటోంది. వీరిలో ఎక్కువగా డాక్టర్లు, ఇంజనీర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.