Ram Charan: మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఆయన వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఆయన ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని దాదాపు శంకర్ మూడు సంవత్సరాలుగా తీస్తూనే ఉన్నాడు.
అయినప్పటికీ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ మాత్రమే బయటికి వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకులు తెలుసుకోవాలంటే కనీసం సినిమా నుంచి టీజర్ అయిన రిలీజ్ చేయాల్సింది. కానీ ఆ టీజర్ ని కూడా రిలీజ్ చేయకుండా మెగా అభిమానుల ఓపికకు పరీక్ష పెడుతున్నాడు. ఇక తమిళ్ తంబీలు మాత్రం రామ్ చరణ్ తో శంకర్ సినిమా చేయడం వల్లే కమలహాసన్ తో శంకర్ చేయాల్సిన ఇండియన్ 2 సినిమా లేటవుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది కమలహాసన్ అభిమానులు రామ్ చరణ్ మీద కోపాన్ని చూపిస్తున్నారు.
నిజానికైతే ఈ విషయం లో రామ్ చరణ్ తప్పేమీ లేదు. అటు ఇండియన్ 2, ఇటు గేమ్ చేంజర్ రెండు సినిమాల షూటింగ్ ను ఏకకాలంలో పూర్తి చేస్తానని చెప్పి శంకర్ ముందుకు సాగాడు..ఇక అది పోను ఇండియన్ 2 సినిమా షూటింగ్ కోసం కొంత టైమ్ కావాలని శంకర్ రామ్ చరణ్ ను అడిగితే అప్పటికే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం చాలా డేట్స్ ఇచ్చాడు.
అయిన కూడా అవి వేస్ట్ అవుతాయని తెలిసిన కూడా రామ్ చరణ్ శంకర్ తో ఆ సినిమా చేసుకోండని చెప్పాడు. కానీ ఈ విషయాన్ని మాత్రం తమిళ్ తంబీలు అర్థం చేసుకోవడం లేదు. నిజానికి శంకర్ వల్లే ఇటు రామ్ చరణ్, అటు కమలహాసన్ ఇద్దరూ కూడా భారీగా నష్టపోతున్నారనే చెప్పాలి…