Soak Mangoes: సీజనల్ ఫ్రూట్స్ తినాలని ఎవరికి ఉండదు. ఒకసారి మిస్ అయితే మళ్లీ సీజన్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే ఫాగ్ అనరు. మామిడికాయల సీజన్ అంటారు. మార్కెట్ లోకి వెళ్తే చాలు పచ్చటి మామిడి కాయలు నోరు ఊరిస్తుంటాయి. ఈ మామిడికాయలను తినాలని చిన్నాపెద్ద అందరికీ కోరికగానే ఉంటుంది. అయితే మామిడికాయలను తినేముందు నానబెట్టి మరీ తింటారు. దీనికి కారణం ఏంటి అని ఎప్పుడైనా గమనించారా? అసలు ఎందుకు తినేముందు మామిడికాయలను నానబెడతారంటే..
మన దేశంలో ఈ నానబెట్టి తినే సంప్రదాయం శతాబ్దాల నుంచి ఉంది. అయితే మామిడి కాయలను తినే గంట ముందు నానబెడితే ఫైటిక్ యాసిడ్ స్థాయిని చాలావరకు తగ్గించవచ్చట. ఫైటిక్ యాసిడ్ యాంటీ న్యూట్రియల్ అని ఇది శరీరంలో మినరల్స్ శోషణను నిరోధిస్తుందని అంటారు శాస్త్రవేత్తలు. ఐరన్, జింక్, కాల్షియం వంటి అవసరమైన ఖనిజాలను గ్రహించే శరీర సామర్థ్యాన్ని ఫైటిక్ యాసిడ్ బలహీనపరుస్తుంది. అయితే మామిడి పండ్లను 1-2 గంటలు నానబెట్టి తింటే ఈ ఫైటిక్ యాసిడ్ తొలిగిపోతుంది. ఫలితంగా పోషకాలు లభిస్తాయి.
ఈ ఫైటిక్ యాసిడ్ మానవ శరీరంపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు నిపుణులు. దీనివల్ల ఐరన్, కాల్షియం, జింక్ శోషణను నిరోధిస్తూ మినరల్స్ లోపాలను ప్రోత్సహిస్తుందట. అందుకే దీన్ని యాంటీ న్యూట్రియంట్ అంటారు. ఇక మామిడికాయలను గంట నుంచి గంటన్నర పాటు నానబెట్టడం మంచిది. దీనివల్ల ఎలాంటి చెడు ఫలితాలు ఉండవు. అందుకే మామిడికాయలను నానబెట్టి మరీ తింటారు. మీకు ఈ విషయం తెలియకపోతే ఇక నుంచి అయినా మామిడికాయలను నానబెట్టిన తర్వాతనే తినండి.