Market Holiday: నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి.. ఇండియా స్టాక్ మార్కెట్ పని చేస్తుందా..?

శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయా.. ఈ రోజు సెలవు ప్రకటించారా.. అని తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో మదుపర్లు నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్ సైట్లలో ఈ వెతుకులాట సాగింది.

Written By: Mahi, Updated On : August 26, 2024 11:51 am

Krishnashtam day stock Market Open or close

Follow us on

Market Holiday: ఇండియన్ స్టాక్ మార్కెట్ గత వారం లాభాల్లో నడిచింది. తిరిగి సోమవారం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ రోజు మార్కెట్ కు సెలవు ఉంటుందా అని అంతా అయోమయంలో పడ్డారు. దలాల్ స్ట్రీట్ ఈ రోజు తెరుచుకుంటుందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నారు. ఈ ఏడాది స్టాక్ మార్కెట్ సెలవుల జాబితాను సెర్చ్ చేస్తున్నారు. భారత్ స్టాక్ ఎక్చేంజ్, ఎన్ ఎస్ఈ వెబ్ సైట్లలో ఇందుకు సంబంధించిన సమాచారం కోసం పరిశోధిస్తున్నారు. ఈ ఏడాది సెలవుల జాబితా ను వెతుకుతున్నారు. ఇక దీనిపై కొందరు నిపుణులు మదుపర్లకు సలహాలు ఇస్తున్నారు. ఇటువంటి అయోమయం నుంచి బయటపడాలంటే ముందుగా బీఎస్ఈఇండియా. కామ్ కు వెళ్లి పైన ఉన్న ట్రేండింగ్ హాలీడేస్ పై క్లిక్ చేయాలి. అందులో స్టాక్ మార్కెట్ కు సంబంధించి 2024 పూర్తి సెలవుల జాబితా అందులో అందుబాటులో ఉంటుందని తెలిపాడు. ఇక అందులో కేవలం ఈ ఆగస్టు నెలలో ఒక రోజు మాత్రమే సెలవు దినంగా కనిపిస్తున్నది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక రోజు సెలవు దినం అందులో స్పష్టంగా ఉంది. ఇక ఆ తర్వాత అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మాత్రమే సెలవు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.

ఈ నేపథ్యంలో శ్రీకృష్ణజన్మాష్టమి సెలవు కాదని స్పష్టంగా అందులో ఉంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో యథావిధిగా సోమవారం కార్యకలాపాలు కొనసాగుతాయి. సోమవారం ట్రేడింగ్ ఉంటుందనేది ఇక్కడ అందరు తెలుసుకోవాలి. 2024లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా ప్రకారం మొత్తంగా 15 సెలవులు ఉన్నాయి.

ఇందులో ఆగస్టు 15 తర్వాత కేవలం నాలుగు సెలవులే ఉన్నాయి. ఇందులో అక్టోబర్ 2 గాంధీ జయంతి, నవంబర్ 1 దీపావళి, నవంబర్ 15 గురునానక్ జయంతి, డిసెంబర్ 25 క్రిస్మస్ గా స్పష్టంగా ఆ వెబ్ సైట్ లో ఉంచారు. ప్రస్తుతం ట్రేడ్ మార్కెట్ లాభాల్లో ఉంది. గత వారం లాభాల్లోనే ముగిసింది. ఇక నిఫ్టీ 50 24, 823 వద్ద ముగిసింది. 283 పాయింట్లు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ .80 శాతం లేదా 650 పాయింట్లు పెరిగి 81,086 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ దాదాపు 0.83 శాతం లాభాన్ని నమోదు చేసింది. కాగా, 50,933 వద్ద ముగిసింది.

విస్తృత మార్కెట్‌లో, స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ సూచీలు ఫ్రంట్‌లైన్ భారతీయ సూచీలను అధిగమించాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 3.40 శాతం వారానికి లాభాన్ని నమోదు చేయగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ గత వారం 1.95 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇక సోమవారం ఉదయం ఎలా ప్రారంభమవుతాయోనని చాలా మంది ఆలోచనలో ఉన్నారు. గతవారం లాభాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ ఈ వారం ఎలా ఉంటుందోననే చర్చ కూడా జరుగుతున్నది. గత వారం పలు కంపెనీల సూచీలు హైలో కొనసాగగా, మరికొన్ని కంపెనీల డౌన్ ఫాల్ కొనసాగింది.

ఏదేమైనా పెద్ద కంపెనీలు మాత్రం మదుపర్లకు కొన్ని లాభాలను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం భయాలు ఇంకా మదుపర్లను వెంటాడుతున్నాయి. ఈ సందర్భంగా మార్కెట్ ట్రేడింగ్ సరళిని మదుపర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.