https://oktelugu.com/

Mahindra XUV700 vs Tata Safari : టాటా సఫారీకి పోటీగా మహీంద్రా XUV 700.. ఫీచర్లు, ధర ఎంతంటే?

ఇక మహీంద్రా XUV 700 బేస్ MX వేరియంట్ 5 సీటర్ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు అది 7 సీటర్ లో లభిస్తోంది.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని సాధించేందుకు మహీంద్రా ఈ కొత్త ఎత్తుగడ వేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2024 / 07:59 AM IST

    Mahindra XUV700 is Rs 3 lakh cheaper than Tata Safari

    Follow us on

    Mahindra XUV700 vs Tata Safari : భారతీయ కారు మార్కెట్ లో మహీంద్రా XUV 700తో సరికొత్త నమూనాను ఆవిష్కరించింది.. ఇది సంచలనాత్మక ఉత్పత్తి అని మహీంద్రా కంపెనీ చెబుతోంది.. ప్రస్తుతం మన దేశంలో మహీంద్రా, టాటా కంపెనీలు ప్రధాన కార్ల మార్కెట్లో పోటీదారులుగా ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు XUV, Safari వేరియంట్లలో వాహనాలను మిడ్ సైజ్ 7 సీటర్ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్) వరకు రూపొందించాయి. ఈ రెండు కంపెనీల మధ్య పోటీ ఉండగా.. మధ్యలోకి MG హెక్టర్ ప్లస్ కూడా వచ్చింది.. ఆ తర్వాత పోటీని తట్టుకునేందుకు టాటా కంపెనీ తన సఫారీ వేరియంట్ (6 – 7 సీటింగ్ కెపాసిటీతో రూపొందించే) వాహనాలకు మరిన్ని సౌకర్యాలు జత చేయడం మొదలుపెట్టింది.. ఇక మహీంద్రా XUV 700 బేస్ MX వేరియంట్ 5 సీటర్ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు అది 7 సీటర్ లో లభిస్తోంది.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని సాధించేందుకు మహీంద్రా ఈ కొత్త ఎత్తుగడ వేసింది.

    XUV 700 వేరియంట్ లో 7 సీటర్ కెపాసిటీ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టడాన్ని గేమ్ చేంజర్ లాగా మహీంద్రా అభివర్ణిస్తోంది. దీని ధరను 18.83 లక్షలు (ముంబై ఆన్ రోడ్) గా నిర్ణయించింది. అయితే టాటా సఫారీ 7 సీటర్ వేరియంట్ ధర 19.58 లక్షల నుంచి (ముంబై ఆన్ రోడ్ ధర) ప్రారంభమవుతుంది. ఇలా ధర తగ్గించి విక్రయించడం వల్ల తమ కంపెనీ కార్ల విక్రయాలు పెరుగుతాయని మహేంద్ర భావిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త వేరియంట్ ను మహీంద్రా కంపెనీ డీజిల్ మాన్యువల్ రూపంలో మాత్రమే విడుదల చేసింది. MX 5 seater వేరియంట్ కు, MX 7 seater వేరియంట్ కు కేవలం 40 వేల ధర మాత్రమే తేడా ఉంది.. XUV 700 లో కొత్త MX 7 – సీటర్ ధర సుమారు 18.83 లక్షలు (ముంబై ఆన్ రోడ్). AX 3 -7 సీటర్ వేరియంట్ తో పోలిస్తే ఇది దాదాపు 3.5 లక్షలు తక్కువ.

    ఫీచర్లు ఏంటంటే

    ఈ కొత్త వాహనం 153 bhp, 360 Nm తో గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే 2.2 డీజిల్ ఇంజన్ కలిగి ఉంది.. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆధారంగా పనిచేస్తుంది.. ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టం, అనలాగ్ డయల్స్, ఏడు అంగుళాల MID, ఆండ్రాయిడ్ ఆటో, పవర్డ్ ORVM లు, టిల్డ్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, ఫాలో – మీ – హెడ్ ల్యాంప్ ల వంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఇవి మాత్రమే కాక SUV కప్ హోల్డర్లు, USB చార్జింగ్ పోర్ట్, మూడు వరుసలలోAC వెంట్ లు ఉన్నాయి.