Homeబిజినెస్Vivo V60 Lite 5G Review: కెమెరా కింగ్ ఈ ఫోన్.. బ్యాటరీ లోనూ తగ్గేదేలే.....

Vivo V60 Lite 5G Review: కెమెరా కింగ్ ఈ ఫోన్.. బ్యాటరీ లోనూ తగ్గేదేలే.. ధర ఎంత అంటే?

Vivo V60 Lite 5G Review: కొన్ని స్మార్ట్ ఫోన్లు ప్రత్యేక ఫీచర్ల విషయంలో అద్భుతమైన పనితీరును కనపరుస్తాయి. నేటి కాలంలో సోషల్ మీడియా కంటెంట్ సృష్టించేవారు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటివారు కెమెరా పనితీరు మెరుగ్గా ఉండే ఫోన్లపై ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనికి అనుగుణంగా Vivo కంపెనీ బెస్ట్ కెమెరా మొబైల్ గా మార్కెట్లోకి వచ్చింది. ఇందులో ఉండే కెమెరాతో అద్భుతమైన ఫోటోగ్రఫీని పొందవచ్చు. అలాగే స్మార్ట్ ఫీచర్స్ తో పాటు బ్యాటరీ పర్ఫామెన్స్ కూడా బెస్ట్ అని చాలామంది కొనియాడుతున్నారు. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Vivo కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎన్నో రకాల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే లేటెస్ట్ గా అప్డేట్ టెక్నాలజీ తో కూడిన మొబైల్ ఇటీవల మార్కెట్లో రిలీజ్ అయింది. V60 Lite 5G పేరుతో ఉన్న ఈ మొబైల్ రోజువారి వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉందని అంటున్నారు. ఇందులో 6.77 అంగుళాల బిగ్ డిస్ప్లే చూడవచ్చు. ఈ డిస్ప్లే తో మూవీస్ చూసేవారికి, గేమింగ్ కోరుకునే వారికి అనుగుణంగా ఉంటుంది. అలాగే స్మూత్ స్క్రోలింగ్ ఉండడంతో అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఇది స్లిమ్ గా ఉండడంతో చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉండనుంది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో సెక్యూరిటీ గా ఉండనుంది.

ఈ మొబైల్ లో ప్రధానంగా కెమెరా గురించి చెప్పుకోవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 8 MP అల్ట్రా వైడ్ లైన్స్ తో కూడిన కెమెరా ఉండడంతో గ్రూప్ ఫోటో కూడా నీట్ గా వస్తుంది. అలాగే జూమ్ చేసినా కూడా Resolution తగ్గకుండా క్వాలిటీ ఫోటో తీసుకోవచ్చు. 32 MP సెల్ఫీ కెమెరా కూడా ఉండడంతో వీడియో కాలింగ్ కోసం సౌకర్యవంతంగా ఉంటుంది.. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ ఫోన్ రెస్ట్ ఎంపిక అని అంటున్నారు. ఇందులో 6 S Gen 2 ప్రాసెసర్ ఉండడంతో వేగంగా పనిచేయడానికి ఆస్కారం ఉంది. అలాగే ఒకేసారి చాలావరకు యాప్స్ ఉపయోగించినా కూడా ఫోన్ వేగం తగ్గదు. అన్ని రకాల సాఫ్ట్వేర్ కు సపోర్ట్ చేయడంతో ఉద్యోగులకు తమ వర్క్ కు సంబంధించిన సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

ఇందులో బ్యాటరీ మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.6500 mAh బ్యాటరీ ఉండడంతో రోజంతా వినియోగించినా కూడా చార్జింగ్ తగ్గకుండా ఉంటుంది. అలాగే ఈ బ్యాటరీ 90 W ఫాస్ట్ ఛార్జింగ్ పనిచేయడంతో అర్జెంట్ అవసరం ఉన్నవారు తొందరగా చార్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇందులో నేటి తరం వారికి ఉపయోగపడే స్మార్ట్ ఫీచర్లను చేర్చారు. వైఫై, బ్లూటూత్, GPS, USB type C వంటివి ఉన్నాయి. గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో వంటివి ఆకర్షణ ఇస్తాయి. దీని ధర రూ.38,000 నుంచి రూ.41,000 వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version