OTT: గత వారం దాదాపు 17 సినిమాలు, సిరీస్లు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ వంటి క్రేజీ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. కాగా ఓటీటీలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక ఇంటర్నెట్ మూవీ డేటా బేస్(IMDB) రేటింగ్ పొందిన చిత్రాలు ఏమిటో చూద్దాం.
సిద్ధూ జొన్నగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదలై భారీ విజయం సాధించింది. ఈ చిత్రం ఏకంగా రూ. 125 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్ళు రాబట్టింది. మాలిక్ రామ్ దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. టిల్లు స్క్వేర్ ఏప్రిల్ 26 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ చిత్రానికి 8 IMDB రేటింగ్ దక్కినట్లు సమాచారం.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది థాంక్ యూ గుడ్ నైట్: ది బోన్ జోవి స్టోరీ. యదార్థ సంఘటన ఆధారంగా ఈ డాక్యుమెంటరీ సిరీస్ తెరక్కింది. 1980 నుండి మ్యూజిక్ బ్యాండ్స్ ఎవల్యూషన్, మార్పులు చక్కగా చూపించారు. ఈ సిరీస్ 7.7 IMDB రేటింగ్ పొందింది. మ్యూజిక్ లవర్స్ బాగా ఇష్టపడే సిరీస్ ఇది.
ఇంగ్లీష్ సిరీస్ డెడ్ బాయ్ డిటెక్టివ్స్ ఓటీటీ లో విశేష ఆదరణ అందుకుంటుంది. మనిషి మరణం తర్వాత ఏమవుతుంది? మరో ప్రపంచం ఉంటే? అక్కడ పరిస్థితులు ఏంటి? అనే పాయింట్ ఆధారంగా డెడ్ బాయ్ డిటెక్టివ్స్ రూపొందించారు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న డెడ్ బాయ్ డిటెక్టివ్స్ 7.6 IMDB రేటింగ్ అందుకుంది.
స్పానిష్ సిరీస్ ది అసుంత కేస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ది అసుంత కేస్ రూపొందించారు. 2013లో 12 ఏళ్ల పాప మిస్ అవుతుంది. దాని వెనుకున్న మిస్టరీని ఎలా ఛేదించారు అనేది సస్పెన్సు, క్రైమ్ అంశాలతో తెరకెక్కించారు. ది అసుంత కేస్ 7.1 ఇండీబీ 6 రేటింగ్ సాధించింది.