Hari Hara Veeramallu Concept: ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘సనాతన ధర్మం’ అనే కాన్సెప్ట్ ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశం లో ఏ నాయకుడు కూడా ఈ కాన్సెప్ట్ మీద మాట్లాడడేందుకు ధైర్యం చేయడు. కానీ పవన్ కళ్యాణ్ నిజాలను నిక్కచ్చి గా మాట్లాడుతూ, హిందూ ధర్మం పట్ల జరుగుతున్నా అన్యాయాలను బయట పెట్టే ప్రయత్నం చేశాడు. అందులో సక్సెస్ అయ్యాడు కూడా. ఈ క్రమంలో ఒక వర్గానికి పవన్ కళ్యాణ్ భద్ర శత్రువు అయిపోయాడు. హిందువులు మాత్రం ఆయన్ని దేశవ్యాప్తంగా విశేషంగా ఆదరించడం మొదలు పెట్టారు. అయితే నిజ జీవితం లో సనాతన ధర్మం మీద పోరాటం చేయడం వల్ల విజయవంతమైన ఫలితాలు రావొచ్చేమో కానీ, సినిమాల్లో కూడా ఈ సనాతన ధర్మం కాన్సెప్ట్ ని ఉపయోగిస్తే జనాలు ఆదరిస్తారా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.
రీసెంట్ గా ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం పై కేసు వేస్తామని, మా సర్దార్ పాపన్న గౌడ్ జీవిత చరిత్ర ని వక్రీకరిస్తూ ఈ చిత్రాన్ని తీసినట్టు అనిపించిందని కొందరు మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ‘హరి హర వీరమల్లు’ నిర్మాత ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన ఈ వివాదం పై క్లారిటీ ఇచ్చాడు. ‘ఇది కేవలం ఒక ఫిక్షన్ కథ మాత్రమే. ఎవరిని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, వీళ్లిద్దరి అనుగ్రహం తో పుట్టిన బిడ్డ కాబట్టే ‘హరి హర వీరమల్లు’ అని టైటిల్ ని పెట్టాము. ఇందులో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా కనిపిస్తాడు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడే అభిమానులు కాస్త భయపడుతున్నారు.
Also Read: కేవలం టీజర్ 1000 కోట్లను సంపాదించి పెట్టిందా? కోట్లకు పడగలెత్తిన నిర్మాతలు
రాజకీయ సభల్లో పవన్ కళ్యాణ్ ఈ అంశం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాడు. మళ్ళీ దాని గురించే ఎందుకు అని అభిమానులు అంటున్నారు. కానీ ఇక్కడ ఫ్యాన్స్ చరిత్ర గురించి అర్థం చేసుకోవాలి. ఆరోజుల్లో ఔరంగజేబు హిందూ దేవాలయాల పై చేసిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. పవిత్రమైన దేవాలయాలు ఎన్నో కూల్చేశాడు. మాత మార్పిడి చేసుకోమని హిందువులపై ఎన్నో అరాచకాలు చేశాడు. అతని క్రూరత్వం చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోవాల్సిందే. అవన్నీ ఈ చిత్రం లో చూపించారట. ఔరంగజేబు హిందూ సంస్కృతి నాశనం చేయడానికి చేసే ప్రయత్నాలను అడ్డుకునే పాత్రలో పవన్ కళ్యాణ్ ఇందులో కనిపిస్తాడని, సెకండ్ హాఫ్ లో ఆయన నట విశ్వరూపం చూస్తారని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి. సనాతన ధర్మం మీద సన్నివేశాలు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా కథలో అంతర్లీనంగా ఉంటే ఈ సినిమా కమర్షియల్ గా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకోవచ్చు.
Sanatana Dharma ✊#HariHaraVeeraMallu
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 8, 2025