Mahindra Bolero : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా కార్లు మంచి పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహీంద్రా బోలేరోకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది 7-సీటర్ కాంపాక్ట్ SUV కేటగిరీలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఈ కార్ ధర రూ. 9.79 లక్షల నుంచి రూ. 10.91 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది.
EMI ఆప్షన్‌తో సొంతం చేసుకోండి
మహీంద్రా బోలేరోను ఒక్కసారిగా మొత్తం నగదు చెల్లించి కొనాల్సిన అవసరం లేదు. మీరు ఈఎంఐ (EMI) పద్ధతిలో కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే, బ్యాంకు నుండి లోన్ పొందాలంటే మీ క్రెడిట్ స్కోర్ బాగుండాలి. బ్యాంకులు క్రెడిట్ స్కోర్‌ను పరిశీలించి, అప్పుడే లోన్ మంజూరు చేస్తాయి.
EMI ద్వారా మహీంద్రా బోలేరో కొనుగోలు ప్రాసెస్ ఎలా అంటే ?
మహీంద్రా బోలేరో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ SUV B4 డీజిల్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకుంటే.. దాని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 11.26 లక్షలు ఉంటుంది. దీనికి మీరు బ్యాంక్ నుండి రూ. 10.13 లక్షల లోన్ పొందవచ్చు.
ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి?
ఈ SUVని కొనేందుకు కనీసం రూ. 1.13 లక్షల డౌన్‌పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే, మీరు EMI మొత్తాన్ని తగ్గించుకోవాలనుకుంటే, మరింత ఎక్కువ మొత్తంలో డౌన్‌పేమెంట్ చెల్లించవచ్చు.
బ్యాంక్ 9శాతం వడ్డీతో లోన్ మంజూరు చేస్తే – EMI వివరాలు
లోన్ కాలం EMI మొత్తం (రూ.)
4 ఏళ్లు 25,206
5 ఏళ్లు 21,000
6 ఏళ్లు 18,258
7 ఏళ్లు 16,300
మహీంద్రా బోరోరో స్పెసిఫికేషన్స్ & ఫీచర్లు
ఇంజిన్: 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్
పవర్: 75 bhp, 210 Nm టార్క్
మైలేజ్: 16-18 kmpl
సీటింగ్ కెపాసిటీ: 7-సీటర్
భద్రత: డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, రియర్ పార్కింగ్ సెన్సార్లు
కలర్స్: వైట్, సిల్వర్, బ్రౌన్ వేరియంట్లు
మహీంద్రా బోరోరోకి పోటీగా ఉన్న SUVలు
హ్యుందాయ్ క్రెటా, మారుతి ఎర్టిగా, టయోటా ఇనోవా, టాటా సుమో వంటి మోడళ్లకు బలమైన పోటీని మహీంద్రా బోలేరో ఇస్తోంది.
EMI వివరాలను ముందుగా తెలుసుకోవాలి
మహీంద్రా బోలేరో మీ కుటుంబ ప్రయాణాలకు, కమర్షియల్ అవసరాలకు మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. అయితే కొనుగోలు ముందు మీ బ్యాంక్ లోన్ అర్హతను, వడ్డీ రేట్లను పరిశీలించడం మంచిది. EMI రీపేమెంట్ సులభతరం చేయడానికి ఎక్కువ డౌన్‌పేమెంట్ చెల్లిస్తే మరింత మంచిది.