Gold Prices: బంగారం ధరలు వరుసగా తగ్గుతూ ఆదివారం స్థిరంగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునేవారికి ఇదే లక్కీ ఛాన్స్ అని అంటున్నారు. మరవైపు శుభకార్యాలు నిర్వహించుకునేవారు సైతం ఇదే సమయంలో బంగారం కొనుగోలు చేస్తే లాభాలు ఉండే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అటు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగాయి. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 7న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,270 గా ఉంది. జనవరి 6న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000తో విక్రయించారు. శనివారంతో పోలిస్తే ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. మూడు రోజులుగా వరుసగా తగ్గిన బంగారం ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,420గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,270 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,820తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,270తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,000తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,270తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,600గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,600గా ఉంది. ముంబైలో రూ.76,600, చెన్నైలో రూ.78,000, బెంగుళూరులో 74,000, హైదరాబాద్ లో రూ.78,000తో విక్రయిస్తున్నారు.