spot_img
Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశి వారికి ఆకస్మిక ధన యోగం.. ఈరోజు 12 రాశుల ఫలితాలు...

Rashi Phalalu: ఈ రాశి వారికి ఆకస్మిక ధన యోగం.. ఈరోజు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 7 ఆదివారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్కాటకం, ధనుస్సు రాశుల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.కొన్ని రాశుల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. అలాగే ఈరోజు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

వృషభం:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లోటు కారణంగా అప్పులు చేయాల్సి రావొచ్చు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

మిథునం:
ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం. ఓ సమాచారం సంతృప్తిని ఇస్తుంది.

కర్కాటకం:
ఈ రాశివారికి ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు వస్తాయి. కొందరికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

సింహ:
ఉద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ. వివాహితులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోకుండా ఉండాలి.

కన్య:
వివాహితులు సంతోషంగా గడుపుతారు. వ్యాపారుల లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏ పనులు చేయొద్దు. వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది.

తుల:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించాలి. న్యాయపరమైన అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం:
మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రయోజనాలు ఉంటాయి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చుులు పెరిగే అవకాశాలు ఎక్కువ.

ధనస్సు:
సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

మకర:
ఖర్చులు పెరిగే అవకాశం. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ. పెట్టుబడులకు అనుకూల సమయం.

కుంభం:
ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థులు ఇబ్బందులు పెట్టే ఛాన్స్. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూల సమయం. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

మీనం:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అనుకూల సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper
Exit mobile version