Homeబిజినెస్Best 5g Mobiles: తక్కువ ధర.. బెస్ట్ ఫీచర్స్... 5G మొబైల్స్ ఇవే..

Best 5g Mobiles: తక్కువ ధర.. బెస్ట్ ఫీచర్స్… 5G మొబైల్స్ ఇవే..

Best 5g Mobiles: టెలికాం రంగం 4G నుంచి 5Gకి మారిపోతోంది. 2022 అక్టోబర్ 1న 5G సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడంతో 5G సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. నెట్ వర్క్ సంస్థలు సైతం ఒక్కొక్కటి అప్డేట్ అవుతున్నాయి. వినియోగదారులకు అనుగుణంగా జియో, ఎయిర్ టెల్ కంపెనీలు 5Gని అందుబాటులో ఇప్పటికే తీసుకొచ్చాయి. దీంతో మొన్నటి వరకు వాడిన 4G ఫోన్లు ఇప్పుడు పాతవైపోతున్నాయి. పాత మొబైల్స్ లో 4G మాత్రమే కనెక్ట్ అవుతుంది. 5G కోసం కొత్త ఫోన్లు కొనాల్సిన అవసరం రావడంతో చాలా మంది 5G మొబైల్స్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో వినియోగదారులను ఆకర్షించేలా అద్భుతమైన ఫీచర్లు కలిగి.. తక్కువ ధరలకు అందుబాటులో చాలా కంపెనీలు ఉత్పత్తి చేశాయి. వాటిలో 4 స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోండి.

తక్కువ ధరలో ఫోన్లు కావానుకునేవారికి ‘లావా’ కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ‘లావా బ్లేజ్ 5G’ ఫోన్ ను కూడా అందుబాటులో ఉంచింది. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ పరిశీలిస్తే..
4GB Ram,
128GB Storage 6GB Ram,
500 MHA Battery,
50 Megapixel ను కలిగి ఉంది. దీని ధర రూ.10,999. నేటి కాలంలో సామాన్యులు సైతం 5Gని ఉపయోగించేందుకు ఈ మొబైల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మొబైల్స్ లో అత్యంత ప్రజాధరణ పొందిన కంపెనీ ‘వీవో’. ఈ కంపెనీ ‘వీవో టి 2 ఎక్స్ 5G’ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఫీచర్స్ పరిశీలిస్తే..
4GB Ram,
128GB Storage 8 GB Ram,
50 Megapixel Camera, 8 Megapixel సెల్ఫీ,
6.58 Inches HD+LCD Screen ఉంది. వీటితో పాటు వాటర్ డ్రాప్ నాచ్, సైడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. కొంచెం అడ్వాన్ష్ ఫీచర్ కలిగిన ఈ మొబైల్ ధర రూ.12,999.

ఒకప్పుడు మార్కెట్లో ‘శాంసంగ్’ మొబైల్స్ అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఈ కంపెనీ సైతం ‘గెలాక్సీ ఎమ్ 14 5G’ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఫీచర్స్ పరిశీలిస్తే..
4GB Ram,
128GB Storage 6 GB Ram,
50 Megapixel Camera
6.6 Inches PLSLCD Screenను కలిగి ఉంది. ఈ మొబైల్ డిజైన్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.14,990.

5జీ నెట్ వర్క్ ను కలిగి మార్కెట్లోకి వచ్చిన మొబైల్స్ లో ‘పోకో ఎక్స్ 5జీ’ ఒకటి. దీని ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి.
8GB Ram,
128GB Storage 6 GB Ram, 256GB Storage 8GB Ram
50 Megapixel Camera
6.67 InchesScreen
500 MH Batteryని కలిగి ఉంది. దీని ధర రూ.18,999కి విక్రయిస్తున్నారు

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version