Childhood Photo: ఈ బుజ్జిపాపాయి దశాబ్దకాలంగా స్టార్ హీరోయినే.. ఎవరో గుర్తుపట్టండి..

నటించింది 20 సినిమాలు.. కానీ 3 దక్షిణ ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు.. ఓ నంది పురస్కారం సొంతం చేసుకున్న ఆ నటి ఎవరో కాదు త్రిష. అందాల తార త్రిషకు తెలుగులో స్పెష్ ఇమేజ్ ఉంది. అంతేకాకుండా ఆమె తమిళనాడుకు చెందిన ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించింది.

Written By: Chai Muchhata, Updated On : May 2, 2023 11:04 am
Follow us on

Childhood Photo: నేటి కాలంలో సినిమా హీరోయిన్ గా నిలదొక్కుకోవడం చాలా కష్టమే. అందుకే చాలా మంది భామలు ఒకటి, రెండు సినిమాల్లో అలా కనిపించి మాయమైపోతున్నారు. కొందరు ఇతర ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. మరికొందరు ఇండస్ట్రీని వదిలిపెడుతున్నారు. అయితే దశాబ్దం కిందట ఫీల్డులోకి వచ్చిన ఆమె ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అప్టటికీ, ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ నటి చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ గా మారుతోంది. ఇంతకీ ఆమె పాపాయి ఎవరో తెలుసా.

నటించింది 20 సినిమాలు.. కానీ 3 దక్షిణ ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు.. ఓ నంది పురస్కారం సొంతం చేసుకున్న ఆ నటి ఎవరో కాదు త్రిష. అందాల తార త్రిషకు తెలుగులో స్పెష్ ఇమేజ్ ఉంది. అంతేకాకుండా ఆమె తమిళనాడుకు చెందిన ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించింది. తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ అనే చిత్రంతో ఇక్కడి వారికి పరిచయం అయింది. ఆ తరువాత 2004లో వచ్చిన ‘వర్షం’ సినిమాతో ఫేమస్ అయింది. ఈ సినిమాలో అమె నటనతో పాటు డ్యాన్స్ ఇరగదీయడంతో త్రిషకు అవకాశాల పంటపండింది.

ఇలా నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, అతడు, నమో వెంకటేశా లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లోని అగ్రహీరోలందరితో నటించిన ఈమె అగ్ర హీరోయిన్ల సరసనకు చేరింది. అయితే కొన్నాళ్ల పాటు పర్సనల్ విషయాలు ఆమెన ఇబ్బంది పెట్టడంతో సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాతో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటూ వస్తోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు పోస్టు చేస్తూ యూత్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకుంది.

1983 మే 4న చెన్నైలో జన్మించిన త్రిష బర్త్ డే ఈసారి ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఎందుకంటే ఆమె నటించిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతేకాకుండా ఆమె అందం అప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడంతో త్రిషను కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా త్రిషకు సంబంధించిన ఓ చిన్ననాటి ఫొటో వైరల్ అవుతోంది. ఆ పిక్ ను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.