LICs Jeevan Umang Policy: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారులకు అదిరిపోయే తీపికబురు అందించింది. తక్కువ పొదుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశాన్ని ఎల్‌ఐసీ కల్పిస్తుండటం గమనార్హం. ఎల్‌ఐసీ పాలసీల్లో జీవన్ ఉమాంగ్ పాలసీ ఒకటి కాగా 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ ఎండోమెంట్ పాలసీ కాగా లైఫ్ కవర్ తో పాటు డబ్బులు పొందవచ్చు.
ఈ పాలసీ తీసుకోవడం ద్వారా రెండు బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పాలసీలో చేరడం వల్ల 100 సంవత్సరాల వరకు పాలసీ కవరేజ్ లభిస్తుంది. 30 సంవత్సరాల వయస్సులో ఉన్నవాళ్లు 5 లక్షల రూపాయల బీమా మొత్తానికి 30 ఏళ్ల ప్రీమియం టర్మ్‌తో నెలకు 1280 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 15, 20, 25, 30 సంవత్సరాల టర్మ్ తో కూడా ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది.
30 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే 30 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం 40,000 రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. వంద సంవత్సరాల వరకు ఈ విధంగా డబ్బులు వస్తూనే ఉంటాయి. 100 సంవత్సరాల తర్వాత కూడా జీవిస్తే బోనస్, ఎఫ్ఏబీ, బీమా మొత్తం పొందే అవకాశాలు ఉంటాయి. పాలసీని తీసుకోవడానికి ముందు అన్ని వివరాలను కచ్చితంగా తెలుసుకోవాలి.
తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందాలనుకునే వాళ్లు ఈ పాలసీని తీసుకుంటే మంచిది. పలు బీమా కంపెనీలు రోజురోజుకు కొత్త స్కీమ్‌లను ప్రవేశపెడుతుండగా ఎల్‌ఐసీ జీవన్ ఉమాంగ్ వల్ల ఇతర బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. రోజుకు కేవలం 40 రూపాయలు పొదుపు చేయడం ద్వారా 5 లక్షల బీమా పాలసీని తీసుకోవచ్చు.
