Lic: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో మైక్రో సేవింగ్స్ ప్లాన్స్ ను అమలు చేస్తోంది. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఎల్ఐసీ ఈ పాలసీలను అందిస్తోంది. ఈ పాలసీ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. రోజుకు కేవలం 28 రూపాయలు ఆదా చేయడం సులభంగా మంచి లాభాలను అందుకునే అవకాశం ఉంటుంది.
ఎల్ఐసీ మైక్రో సేవింగ్స్ ప్లాన్ లో మొత్తం 5 పెద్ద ఫీచర్లు ఉండగా ఈ పాలసీని తీసుకున్నవాళ్లు జీఎస్టీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పాలసీలో మూడు సంవత్సరాలు ప్రీమియం చెల్లించి తర్వాత ప్రీమియం చెల్లించకపోయినా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు. ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే సులభంగా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీకి లాయల్టీ అదనంగా ఉంటుంది.
ఈ పాలసీ ద్వారా 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ బెనిఫిట్ తో పాటు జీవిత బీమా కవరేజీని కూడా సులువుగా పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. 35 సంవత్సరాల వ్యక్తి సంవత్సరానికి 9831 రూపాయల చొప్పున పాలసీని తీసుకుంటే ఆ వ్యక్తి మెచ్యూరిటీ మొత్తంపై 2,30,000 రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుంది. పాలసీ తీసుకున్న వ్యక్తి 5 సంవత్సరాల లోపు మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయలు లభిస్తాయి.
పాలసీ తీసుకున్న 5 సంవత్సరాల తర్వాత పాలసీదారు మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయల వరకు డబ్బుతో పాటు లాయల్టీ బెనిఫిట్ లభిస్తుంది. ప్రీమియం చెల్లించిన సంవత్సరాల సంఖ్యను బట్టి లాయల్టీ జోడింపును సులభంగా పొందవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Lic super policy chance to earn lakhs by saving rs 28 per day
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com