LIC Policy: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అందిస్తుండగా ప్రతి నెలా పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు ఎల్‌ఐసీ సరళ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి నెలా పెన్షన్ ను పొందాలని భావించేవాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ పాలసీలో ఒక్కసారి ప్రీమియం చెల్లించి జీవితకాలం సులభంగా పెన్షన్ ను పొందవచ్చు.
ప్రీమియం చెల్లించే మొత్తాన్ని బట్టి పెన్షన్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో మొదటిది టేమో లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ 100 పర్సెంట్ పర్చేజ్ ప్రైస్ కాగా పాలసీదారుడు చనిపోయిన తర్వాత ప్రీమియంను నామినీ పొందే అవకాశం ఉంటుంది. జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యుటీ విత్ రిటర్న్ 100 పర్సెంట్ పర్చేజ్ ప్రైస్ భార్యాభర్త ఇద్దరూ పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది.
Also Read: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?
40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీకి అర్హులని చెప్పవచ్చు. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వెంటనే ఈ పాలసీ ద్వారా పెన్షన్ ను పొందవచ్చు. ఈ పాలసీపై ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి రుణం తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో ఈ పాలసీని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎల్‌ఐసీ సిబ్బందిని సంప్రదిస్తే ఈ పాలసీ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Also Read: బిజినెస్ ముచ్చట్లు : టుడే క్రేజీ బిజినెస్ అప్ డేట్స్ !