https://oktelugu.com/

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మరో చిరంజీవి అవుతాడా..?

Vijay Devarakonda: చిరంజీవి స్టార్ గా అవతరించి మూడున్నర దశాబ్దాలు అవుతుంది. ఇన్నేళ్లలో సినిమా నేపథ్యం లేకుండా వచ్చి, స్టార్ హీరో అయిన వారు లేరు. అయితే ఆ అరుదైన ఫీట్ విజయ్ దేవరకొండ అందుకునేలా కనిపిస్తున్నాడు. నాన్ సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పటికే అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. టాలీవుడ్ టాప్ టెన్ హీరోలలో ఆయన ఒకరు. కేవలం రెండు మూడు సినిమాలు విజయ్ దేవరకొండ ఇమేజ్ మార్చివేశాయి. యూత్ లో […]

Written By:
  • Shiva
  • , Updated On : January 22, 2022 / 04:47 PM IST
    Follow us on

    Vijay Devarakonda: చిరంజీవి స్టార్ గా అవతరించి మూడున్నర దశాబ్దాలు అవుతుంది. ఇన్నేళ్లలో సినిమా నేపథ్యం లేకుండా వచ్చి, స్టార్ హీరో అయిన వారు లేరు. అయితే ఆ అరుదైన ఫీట్ విజయ్ దేవరకొండ అందుకునేలా కనిపిస్తున్నాడు. నాన్ సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పటికే అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. టాలీవుడ్ టాప్ టెన్ హీరోలలో ఆయన ఒకరు.

    Vijay Devarakonda

    కేవలం రెండు మూడు సినిమాలు విజయ్ దేవరకొండ ఇమేజ్ మార్చివేశాయి. యూత్ లో విజయ్ దేవరకొండకు ఉన్న ఇమేజ్ రీత్యా అతనితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. విజయ్ దేవరకొండ టూ టైర్ హీరోలలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. అయితే అతన్ని స్టార్ హీరో అనలేం. కానీ ఆ హోదాకు విజయ్ దేవరకొండ అతి చేరువలో ఉన్నాడు.

    Also Read: ఎల్‌ఐసీ సూపర్ ప్లాన్.. ప్రతి నెలా భారీ మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం?

     

    Vijay Devarakonda

    విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ లైగర్ అతని ఇమేజ్ మార్చేసే సత్తా ఉన్న సినిమా. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లైగర్ పై భారీ హైప్ ఉంది. పూరి మ్యాజిక్ వర్క్ అవుట్ అయితే లైగర్ విజయం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. పైగా ఇది పాన్ ఇండియా చిత్రం. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. లైగర్ విజయం సాధిస్తే విజయ్ దేవరకొండ ఇమేజ్ బాలీవుడ్ దాకా పాకుతుంది. దీంతో చిరంజీవి తర్వాత ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హోదా అందుకున్న హీరోగా విజయ్ దేవరకొండ అవతరిస్తారు.

    Also Read: శ్రీశ్రీ కవితలు చదివి మరీ జగన్‌పై ఆర్ఆర్ఆర్ ప్రతాపం.. చూడాల్సిందే?

    Tags