
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆరోగ్య రక్షక్ పేరుతో కొత్త ఆరోగ్య పాలసీని అందుబాటులోకి తెచ్చింది. పూర్తిస్థాయి కుటుంబ ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఎల్ఐసీ ఈ పాలసీని తీసుకొచ్చింది. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉండటం గమనార్హం. 18 నుంచి 65 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.
80 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ పాలసీ కొనసాగుతుంది. ఈ పాలసీ తీసుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో చికిత్స ఖర్చులపై పాలసీదారుడి కుటుంబానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగవు. సాధారణ ఆరోగ్య బీమా పథకం చెల్లింపు రూల్స్ ప్రకారం ఎల్ఐసీ ఈ పాలసీని అమలు చేస్తుండటం గమనార్హం. స్థిర ఆరోగ్య బీమా సౌకర్యం ఉండటం ఈ పాలసీ ప్రత్యేకత అని చెప్పవచ్చు.
హాస్పిటలైజేషన్, సర్జరీలకు కూడా ఈ పాలసీ ద్వారా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. సీనియారిటీ, నో క్లెయిమ్ ఆధారంగా ఈ పాలసీ ద్వారా హెల్త్ కవరేజీని పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆటో స్టెప్-అప్ ప్రయోజనం కూడా ఈ పాలసీ ద్వారా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీ ద్వారా ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల కోసం కవర్ తీసుకోబడితే మరొక వ్యక్తికి ప్రీమియం చెల్లించే స్వేచ్ఛ ఉంటుంది.
అంబులెన్స్, హెల్త్ చెకప్ బెనిఫిట్స్ ను కూడా ఈ పాలసీపై పొందే అవకాశం అయితే ఉంటుంది. సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.